ట్రంప్ వల్ల అమెరికా పరువు పోతోంది..! యూఎస్ మాజీ అధికారులు ఫైర్..
భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ అనుసరిస్తున్న మొండి విధానాలు అమెరికా బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, వ్యూహాత్మకంగా కీలకమైన భారత్‌ను చైనాకు దగ్గర చేస్తున్నాయని వైట్‌హౌస్ మాజీ ఉన్నతాధికారి, గతంలో అధ్యక్షుడు జో బైడెన్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జేక్ సలివాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల ‘ది బల్వార్క్’ అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సలివాన్, ట్రంప్ విధానాల వల్ల అంతర్జాతీయంగా…

