యూపీఐ లావాదేవీల్లో భారత్ టాప్: ఐఎంఎఫ్..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్ టాప్‌గా నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తెలిపింది. ‘గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ చెల్లింపులు: ది వాల్యూ ఆఫ్ ఇంటర్‌ఆపరబిలిటీ’ పేరిట ఐఎంఎఫ్ ఇటీవల విడుదల చేసిన నోట్ ప్రకారం యూపీఐ వేగవంతమైన వృద్ధి కారణంగా భారత్ రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నేడు మన దేశంలో ప్రతి నెలా 1800 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది. …

