పుతిన్‌తో,ట్రంప్ చర్చలు ఫలప్రదం..
గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య శుక్రవారం అలాస్కాలో జరిగిన శిఖరాగ్ర సమావేశం ఫలప్రదంగా ముగిసింది. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన దిశగా గొప్ప పురోగతి సాధించామని ఇరువురు నేతలు ప్రకటించారు. అయితే, తుది ఒప్పందం ఖరారయ్యే వరకు ఏదీ ఖరారైనట్లు కాదని ట్రంప్ స్పష్టం చేశారు. …

