అనంతపురంలో ఉద్రిక్తత… ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బ్యానర్లు చించేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్..
అనంతపురం నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లం…కొ… అంటూ జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయాన్ని ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ ఆడియో క్లిప్‌లో ఎమ్మెల్యే ఎన్టీఆర్‌ను దూషించారని ఆరోపిస్తూ, అభిమానులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహిరంగంగా…

