ఏపీకి కేంద్రం అండగా నిలవాలి.. అశ్విన వైష్ణవ్ కు నారా లోకేశ్ విజ్ఞప్తి..
ఆంధ్రప్రదేశ్‌ను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఆవిష్కరణల రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ తయారీ యూనిట్‌ను మంజూరు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్, భవిష్యత్ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఏపీ టెక్నాలజీ ప్రగతికి సంబంధించిన…

