News

AP

అమరావతికి రూ. 47,000 కోట్లు అవసరం: సీఎం చంద్ర‌బాబు..

రాజధాని అమరావతికి ఇంకా రూ. 47వేల కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డించారు. రాజ‌ధానిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ. 77,249 కోట్లు అవసరం కాగా… వరల్డ్ బ్యాంక్, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఫండింగ్ రూ. 31,000 కోట్లు సమకూరాయ‌ని తెలిపారు. ఇంకా కావాల్సిన నిధులు రూ.47,000 కోట్లు అని వివ‌రించారు.ఆంధ్రప్రదేశ్ అవసరాలు ఇవే..1. పోలవరం-బనకచర్ల అనుసంధానం2. తాగునీటి ప్రాజెక్టులు3. ఐదు పర్యాటక హబ్‌లు(అమరావతి, విశాఖపట్నం, అరకు,…

AP

జగన్ కు టీడీపీ సవాల్… గోశాలలో కలుద్దామన్న భూమన..

తిరుమలలోని ఎస్వీ గోశాల అంశం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. గోశాలలో వందకు పైగా ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ రంగు పులుముకున్నాయి. భూమన వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న భూమనపై కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, తాజాగా భూమనపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

National

వక్ఫ్ చట్టంపై పాక్ వ్యాఖ్యలు… భారత్ కౌంటర్..

వక్ఫ్ సవరణ చట్టంపై పాకిస్థాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఒక వర్గం వారి ఆస్తులకు దూరం చేయడానికే భారత్ ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని పాకిస్థాన్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్ కత్ అలీ పేర్కొన్నారు. ఇది మైనారిటీలను కించపరచడమేనని ఆయన అన్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. దీనిపై తాజాగా భారత్ ధీటుగా స్పందించింది.భారత పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుపై పాకిస్థాన్ చేసిన ప్రేరేపిత, నిరాధార వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని భారత విదేశాంగ…

TELANGANA

ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్..! సీఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయాలు..

పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటితే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పదవులపై బహిరంగ మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని.. ష్టమే జరుగుతుందని చెప్పారు. మంగళవారం జరిగిన సీఎల్పీ మీటింగ్‌లో సీఎం మాట్లాడారు. ఎవరైనా పదవులపై బయట మాట్లాడితే మంచికంటే చెడే ఎక్కువ జరుగుతుందన్నారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఇప్పటికే అనేకసార్లు చెప్పినని.. లీడర్లు అర్ధం కాకపోతే ఎలా అంటూ ఫైరయ్యారు.   ఎమ్మెల్యేలకు CM రేవంత్ సీరియస్ వార్నింగ్  …

AP

ఏపీ లిక్కర్ స్కాం… చిత్రపురి కాలనీలోని మేఘనా రెడ్డి నివాసంలో సోదాలు..

హైదరాబాద్‌లో ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారుల సోదాలు రెండో రోజు కూడా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు… హైదరాబాద్‌లోని మద్యం వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ రోజు రాయదుర్గం పరిధిలోని చిత్రపురి కాలనీలో ఉన్న మేఘనా రెడ్డి నివాసంలో మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించారు. ఆమె బ్యాంకు ఖాతా నుంచి కొంత డబ్బును ఉపసంహరించుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో…

TELANGANA

తెలంగాణలో అధునాతన ఫైర్ ఫైటింగ్ రోబోలు..! దేశంలోనే మొట్టమొదటిసారి..!

రాష్ట్ర అగ్నిమాపక శాఖ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా, అత్యంత ప్రమాదకరమైన అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం అధునాతన ఫైర్ ఫైటింగ్ రోబోలను అందుబాటులోకి తెచ్చింది. సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లే క్లిష్ట పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ రోబో యంత్రాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రారంభ దశలో భాగంగా, ఫ్రాన్స్ నుంచి మూడు అత్యాధునిక రోబోలను అగ్నిమాపక శాఖ సమకూర్చుకుంది. ఒక్కో రోబో విలువ సుమారు రూ. 2 కోట్లు కాగా, మొత్తం…

AP

పవన్ ‘కన్వర్టెడ్ సనాతని’.. పేర్ని నాని సంచలన వాఖ్యలు..!

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్‌ ఒక ‘కన్వర్టెడ్ సనాతని’ అని ఆయన అభివర్ణించారు. ఎన్నికలకు ముందు తన వైఖరికి, ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రదర్శిస్తున్న వైఖరికి మధ్య స్పష్టమైన తేడా ఉందని పేర్ని నాని ఆరోపించారు.   పేర్ని నాని మాట్లాడుతూ, “ఎన్నికల ముందు వరకు తనకు అన్ని మతాలు, కులాలు…

National

వక్ఫ్ బిల్లును నిరసిస్తూ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టులో పిటిషన్..

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ హింస కారణంగా ముర్షిదాబాద్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.   బెంగాల్‌లో హింస, మరణాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా కోరారు. కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ కొనసాగాలని ఆయన విజ్ఞప్తి…

TELANGANA

గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో పెద్ద కుంభకోణం జరిగింది: పాడి కౌశిక్ రెడ్డి..

గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కోఠి కళాశాలలోని 18, 19వ సెంటర్లలో 1,490 మంది పరీక్షకు హాజరుకాగా, 74 మంది ఎంపికయ్యారని… అదేవిధంగా 25 సెంటర్లలో 10 వేల మంది పరీక్ష రాస్తే కేవలం 69 మంది మాత్రమే ఎంపికయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. 654 మందికి ఒకే విధమైన మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.  …

TELANGANA

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్..

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ భూములపై ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.   కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని భూములు ప్రభుత్వ భూములేనని అందులో పేర్కొంది. ఈ భూముల్లోనే కేంద్రీయ విశ్వవిద్యాలయం, మరికొన్ని సంస్థలు, బస్టాండ్ వంటివి వచ్చాయని తెలిపింది. సుమారు 20 ఏళ్లకు పైగా ఈ 400 ఎకరాల స్థలం…