సినీ కార్మికుల వేతనాలు పెంచాలి: మంత్రి కోమటిరెడ్డి
టాలీవుడ్ సినీ పరిశ్రమలో కార్మికులు, నిర్మాణ సంస్థల మధ్య కొద్దికాలంగా నలుగుతున్న వేతన వివాదంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనే బాధ్యతలను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సినీ కార్మికుల వేతనాల పెంపు ఆవశ్యకతను నొక్కి చెప్పారు. “హైదరాబాద్ వంటి నగరంలో జీవించాలంటే కచ్చితంగా వేతనాలు పెంచాల్సిందే” అని ఆయన…

