కేసుల రాజకీయం మానుకో రేవంత్: నల్గొండలో కేటీఆర్ ఘాటు విమర్శలు
నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రెండేళ్లలో రేవంత్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే పనులు ఒక్కటి కూడా చేయలేదని, కేవలం రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు వేయడంలోనే బిజీగా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తూ, మీడియాకు లీకులు ఇస్తూ…

