News

AP

కేంద్ర మంత్రి నిర్మలతో భేటీ: రూ.259 కోట్ల అదనపు నిధులకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ వినతి..

జాతీయ ఆరోగ్య మిషన్, ఇతర పథకాల కింద రాష్ట్రానికి అదనంగా రూ.259 కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో శుక్రవారం ఆయన సమావేశమై ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.   ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద పునఃకేటాయింపులు జరిపే తరుణంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ ప్రతిపాదనను కేంద్రం ముందుకు…

National

మ‌య‌న్మార్‌, థాయ్‌లాండ్‌లో పెను విప‌త్తు… 1000 దాటిన మృతుల సంఖ్య‌..

మ‌య‌న్మార్‌, థాయ్‌లాండ్‌ల‌ను శుక్ర‌వారం నాడు రెండు భారీ భూకంపాలు కుదిపేసిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌కృతి విప‌త్తు కార‌ణంగా మృతుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. రెండు దేశాల్లో క‌లిపి మృతుల సంఖ్య 1000 దాటింద‌ని అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఒక్క మ‌య‌న్మార్‌లోనే 1002 మంది చ‌నిపోయిన‌ట్లు మ‌య‌న్మార్ మిలిట‌రీ అధికారులు తెలిపారు. మ‌రో 2,370 మందికి గాయాలైన‌ట్లు వెల్ల‌డించారు. శిథిలాల కింద చిక్కుకున్న క్ష‌త‌గాత్రుల‌ను రెస్క్యూ సిబ్బంది ర‌క్షించి ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే…

National

జమ్మూకశ్మీర్‌లోని కథువాలో కాల్పులు.. ఇద్దరు ఉగ్ర‌వాదుల హ‌తం..

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హ‌త‌మ‌య్యారు. ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. జుతానాలోని అటవీ ప్రాంతంలో నలుగురు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు దాక్కున్నారనే నిఘా వ‌ర్గాల‌ స‌మాచారం మేర‌కు భద్రతా దళాలు గురువారం ఉద‌యం నుంచి సెర్చ్ ఆప‌రేష‌న్ మొద‌లు పెట్టాయి. ఈ క్ర‌మంలో ఉగ్ర‌వాదులు, బ‌ల‌గాల మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.   ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ నాలుగో రోజు కొనసాగుతోందని అధికారులు…

AP

పిఠాపురం అభివృద్ధిపై పవన్ స్పెషల్ ఫోకస్..! త్వరలోనే..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నియోజవర్గం పిఠాపురం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇకపై నియోజక వర్గ అభివృద్దిపై వరుస రిప్యూలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వేసవిలో నియోజకవర్గంలోని గ్రామాలు, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పిఠాపురంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అర్బన్ డెవలప్ మెంట్ అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం…

TELANGANA

తెలంగాణలో 153 అసెంబ్లీ సీట్లు.. డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!

రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి రూటే సెపరేటు. ఆయన స్టైల్ అందరికంటే డిఫరెంట్. ఏదో వచ్చామా.. ఏదో చేస్తున్నామా.. అన్నట్టు ఉండరు. రేవంత్ రంగంలోకి దిగారంటే.. దేత్తడి పోచమ్మ గుడి అన్నట్టే ఉంటుంది. నీళ్లు చల్లి.. బొట్టు పెట్టి.. ముస్తాబు చేసి.. మైసమ్మకు బలి ఇవ్వాల్సిందే. లేటెస్ట్‌గా కేంద్ర ప్రతిపాదిత డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు, కదుపుతున్న పావులు.. రాజకీయ కురవృద్ధులనే కంగు తినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో కాక రేపుతున్నాయి.   డీలిమిటేషన్‌పై…

TELANGANA

సీఎం రేవంత్ రెడ్డికి అసెంబ్లీ వేదికగా కేటీఆర్ సవాల్.. !

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు. తన నియోజకవర్గం సిరిసిల్ల లేదా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ కు వెళ్దాం.. ఎక్కడైన వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తారా..? ఒక వేళ వంద శాతం రుణమాఫీ జరిగినట్లు ప్రూఫ్ అయితే రాజకీయాలే వదిలేస్తా అని కేటీఆర్ సవాల్ విసిరారు.   ‘ఎంపీ ఎన్నికల్లో మాకు వచ్చింది గుండు సున్నా. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి వచ్చింది…

AP

బెట్టింగ్ యాప్ డౌన్ లోడర్లకు ఏపీ సర్కార్ షాక్..!

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. బెట్టింగ్ యాప్స్ ను జనం డౌన్ లోడ్ చేసుకోకుండా నిషేధించే పరిస్ధితి లేకపోవడంతో దానికి కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఐటీ శాఖ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను తయారు చేయిస్తోంది. దీంతో బెట్టింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే వారి భరతం పట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో బెట్టింగ్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవాలంటేనే భయపడే పరిస్ధితి తీసుకురానుంది.…

TELANGANA

‘విద్య’పై రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం..?

విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆ రంగంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే వ్యవస్థలో అవసరమైన ప్రక్షాళన చేయడం సాధ్యపడుతుందని చెప్పారు. విద్యా రంగంపై శాసనమండలిలో జరిగిన ప్రత్యేక చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.   2021 నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేలో పేర్కొన్న గణాంకాలను సభలో వివరించారు. సబ్జెక్టుల వారిగా తెలంగాణలో ఏ స్థానానికి పడిపోయిందీ తెలిపారు. ఏ సబ్జెక్టులోనూ కనీస…

AP

కొత్త జిల్లాల పై చంద్రబాబు కీలక ఆదేశాలు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో భాగం గా ముఖ్యమంత్రి కొత్త జిల్లాల్లో పాలన పైన పలు సూచనలు చేసారు. కొత్త జిల్లాల్లో అధికారులకు పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లాతో సంబంధం లేకుండా అధికారాలు కేటాయించాలని ఆదేశించారు. స్వేచ్ఛగా వారు విధులు నిర్వహించే వెసులుబాటు ఉండాలని స్పష్టం చేసారు. ఈ మేరకు సంబం ధిత ఆదేశాలను హెచ్‌ఓడీలు రెండు రోజుల్లో జారీ చేయాలని ఆదేశించారు.   కొత్త జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు…

National

గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..

కేంద్ర ప్రభుత్వం గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్‌పై కీలక ప్రకటన చేసింది. ఈ అంశాలకు సంబంధించి రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. వీటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.   డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ, తమిళనాడు ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించిందని, దీనిపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం తన నైతిక బాధ్యత నుంచి తప్పించుకుంటోందా అని మారన్…