News

TELANGANA

ఉప ఎన్నికలపై కోర్టు నిర్ణయిస్తుంది, రేవంత్ రెడ్డి సీఎంలా వ్యవహరించాలి: కేటీఆర్

తెలంగాణలో ఉప ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే అంశం కోర్టు పరిధిలో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.   శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఉండబోవని చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోదాను విస్మరిస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.   ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభ వేదికగా తీర్పు వెల్లడించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కోర్టుల్లోని అంశాలపై వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.…

AP

విశాఖలో లులూ మాల్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఎట్టకేలకు విశాఖలో లులూ మాల్‌కు లైన్ క్లియర్ అయ్యింది. దీనికి సంబంధించి ఆ గ్రూప్ ముందుకు రావడం, వెంటనే చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయింది. ఆపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపో మాపో మాల్‌కు శంకుస్థాపన జరగనుంది. ఎందుకు లులూ మాల్ విషయంలో డిలే అవుటోంది? అన్నదే అసలు చర్చ.   అసలు ఏం జరిగింది?   2018లో టీడీపీ సర్కార్ లులూ గ్రూపుకు విశాఖలో స్థలం కేటాయించింది. మాల్…

National

లోక్‌సభలో సవరించిన ఆర్థిక బిల్లు 2025 ఆమోదం.. డిటిటల్ పన్ను, గూగుల్ పన్ను రద్దు..

లోక్‌సభలో సవరించిన ఆర్థిక బిల్లు 2025ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. 35 సవరణల తర్వాత మంగళవారం (మార్చి 25) లోక్‌సభ ఆర్థిక బిల్లు 2025 ఆమోదం పొందింది. ఈ సవరణలలో.. ఆన్‌లైన్ ప్రకటనలపై 6 శాతం డిజిటల్ పన్ను, గూగుల్ పన్నులను నుంచి ప్రజలకు ఊరట లభించనుంది. దీంతో లోక్‌సభలో ఈ బిల్లు ప్రక్రియ పూర్తయింది. పన్ను చెల్లింపుదారులకు ఈ బిల్లు.. పన్ను ఉపశమనాన్ని అందిస్తుందని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా అభివర్ణించారు.…

TELANGANA

బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై స్పందించిన వీసీ సజ్జనార్..

బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌ల బాధితులకు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. సమస్య ఏదైనా ఆత్మహత్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. ‘బలవన్మరణం వద్దు… బతికి సాధించడమే ముద్దు’ అని బెట్టింగ్ యాప్‌ల బాధితులకు సూచించారు.   ఆన్‌లైన్ బెట్టింగ్ బాధితులు బలవన్మరణాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. “ఆలోచించండి.. మీరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభను అనుభవిస్తారో. సమస్య వచ్చినప్పుడు…

TELANGANA

తెలంగాణకు భారీ పెట్టుబడి.. యూనిట్ స్థాపనకు ముందుకొచ్చిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం బీవైడీ..

చైనాకు చెందిన విద్యుత్తు కార్ల తయారీ సంస్థ బీవైడీ హైదరాబాద్‌లో ఫ్యాక్టరీ స్థాపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వంతో కొంతకాలంగా జరుగుతున్న చర్చలు ఫలించినట్టు సమాచారం. బీవైడీ యూనిట్ స్థాపనకు అవసరమైన భూమిని కేటాయించడంతోపాటు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని బీవైడీకి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు తెలిసింది. యూనిట్ ఏర్పాటుకు హైదరాబాద్‌లోని మూడు ప్రదేశాలను ప్రభుత్వం ప్రతిపాదించగా, సంస్థ ప్రతినిధులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మూడింటిలో ఒకదానిని ఎంపిక చేయగానే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.…

TELANGANA

గుంటూరులో మిర్చి రైతుల ఆందోళన..

మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో మంగళవారం రైతులు ఆందోళన చేపట్టారు. గుంటూరు మిర్చి యార్డు ఎదుట నల్లపాడు రోడ్డుపై రైతులు బైఠాయించి దాదాపు మూడు గంటల పాటు నిరసన తెలిపారు.   వ్యాపారుల మాయాజాలంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి యార్డుకు సరుకు తీసుకొస్తే కొనుగోలు చేస్తారన్న నమ్మకం కూడా లేకుండా పోయిందని వాపోయారు. వ్యాపారులు ధరల్లో కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా…

AP

ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం..

బెట్టింగ్ యాప్ లు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. వీటి బారిన పడిన ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ యాప్ లను సినీ నటులు, యూట్యూబర్లు, క్రీడాకారులు ప్రమోట్ చేస్తుండటంతో… ఎంతోమంది వీటికి ఆకర్షితులవుతున్నారు. ఒక్కసారి బెట్టింగ్ వలలో పడ్డారంటే… ఇక బయట పడటం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం కలకలం రేపుతోంది. ఈ యాప్ లను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలు కేసులు ఎదుర్కొంటున్నారు.   తాజా పరిణామాల…

TELANGANA

ప్రజావాణిలో హైడ్రాకు 63 ఫిర్యాదులు..

హైదరాబాద్‌లోని చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూముల కోసం పని చేస్తున్న హైడ్రాకు ప్రజావాణిలో 63 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదులను స్వీకరిస్తోంది. ఈ క్రమంలో, ప్రభుత్వ భూములు కాపాడాలంటూ ఈరోజు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.   ప్రజల అవసరాలకు ఉద్దేశించిన భూమిని స్థానికంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు కబ్జా చేస్తున్నారని, వాటిని కాపాడాలని పలువురు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పాఠశాలలు, పిల్లలు ఆడుకునే స్థలాలను కూడా కొంతమంది కబ్జా…

TELANGANA

SLBC టన్నెల్ లో మరో మృతదేహం గుర్తింపు..

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ లో సహాయక చర్యల్లో కొంత పురోగతి కనిపించింది. సహాయక చర్యల్లో 32వ రోజున టన్నెల్ లో మరో మృతదేహాన్ని గుర్తించారు. ఒక కాలు కనిపించడం, దుర్వాసన రావడంతో అక్కడ తవ్వకాలు చేపట్టారు. మధ్యాహ్నానికి మృతదేహాన్ని బయటకు తీసుకురానున్నారు.   టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవసమాధి అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను గుర్తించారు. మరో ఆరుగురి మృతదేహాల కోసం గాలింపు జరుగుతోంది.   మరోవైపు, టన్నెల్…

AP

నేడు, రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల పాటు సమావేశం జరగనుంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కలెక్టర్ల సమావేశంలో సీసీఎల్ఏ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు ప్రసంగించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.   తొలి రోజు వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్, ల్యాండ్ సర్వే, వేసవిలో నీటి ఎద్దడి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో…