News

National

మోడీని కలిసిన అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్.. పలు కీలక విషయాలపై చర్చ..!

న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సాయంత్రం అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్డ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, భద్రతా పరిస్థితులపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పును ఓడించడానికి తులసి గబ్బర్డ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఉగ్రవాదంపై అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇది అమెరికన్ ప్రజలకు “ప్రత్యక్ష ముప్పు”గా అభివర్ణించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీతో కలిసి పరిగణిస్తామని తెలిపారు. ఈ నిరంతర ముప్పును ఎదుర్కోవడానికి రెండు దేశాలు కలిసి…

AP

ఏపీకి గుడ్ న్యూస్..! ఆ మూడు నగరాల్లో లులు మాల్స్..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఆధ్యాత్మిక నగరం తిరుపతి, సాగర నగరం విశాఖపట్నంలలో మాల్స్ ఏర్పాటు చేసేందుకు లులు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు. నిజానికి 2014-19 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వం విశాఖపట్నం సాగర తీరంలో లులు మాల్‌కు స్థలం కేటాయించింది. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అది కాస్త హైదరాబాద్‌కు తరలిపోయింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి వచ్చేందుకు…

AP

వైఎస్ఆర్ పేరు విషయంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

వైఎస్ఆర్ పేరు విషయంలో ఏపీ కేబినెట్ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక చోట పూర్తిగా వైఎస్ఆర్ అనే పేరుని తొలగించగా, మరో చోట వైఎస్ఆర్ పేరుకున్న ప్రాధాన్యత కాస్త తగ్గించేలా కేబినెట్ నిర్ణయం ఉంది. వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాల్టీ పేరులో వైఎస్ఆర్ పేరుని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఇకపై తాడిగడప మున్సిపాల్టీ అనే పేరు మాత్రమే ఉంటుంది. అందులో వైఎస్ఆర్ అనే అక్షరాలు కనిపించవు. ఇక రెండో విషయం కూడా వైఎస్ఆర్ అనే పేరుతో…

TELANGANA

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..

బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లు రూపొందించగా తాజాగా ఆమోద ముద్ర వేసింది. బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర పడటం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   కాంగ్రెస్ నేతలు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. బిల్లులకు ఆమోదముద్ర పడిన అనంతరం సభ రేపటికి వాయిదా వేశారు. కాంగ్రెస్ పార్టీ కి చెందిన…

TELANGANA

తెలంగాణ టూరిజం పాలసీ జీవో విడుదల..!15 వేల కోట్ల పెట్టుబడులు.. 3 లక్షల జాబ్స్..

తెలంగాణ టూరిజం పాలసీ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో టూరిజం రూపురేఖలు మార్చడమే ధ్యేయంగా గత డిసెంబర్ లో దీన్ని రూపొందించింది. కొన్ని మార్పులు, చేర్పులతో ఫైనల్ చేసిన ఈ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం.. 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చింది. 2025 నుంచి 2030 వరకు ఐదేళ్ల పాటు అమలులో ఉండనున్నది. పర్యాటక ప్రాజెక్టులు ప్రారంభించేవారిని ప్రోత్సహించడంతోపాటు అవసరమైతే…

TELANGANA

రాష్ట్ర వ్యాప్త పర్యటనకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కేటీఆర్ ఈ నెల 20న సూర్యాపేటలో, 23న కరీంనగర్‌లో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు అసెంబ్లీ సమావేశాల అనంతరం వరుసగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటన బీఆర్‌ఎస్‌ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం

National

మేం శాంతిని కోరుకుంటుంటే… పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయి: ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికన్ ఏఐ రీసెర్చర్, ప్రముఖ పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌ నిర్వహించిన ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశం శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తుంటే, అందుకు బదులుగా పాక్ నుంచి శత్రుత్వం, ద్రోహం ఎదురయ్యాయని అన్నారు.   2014లో తన ప్రమాణ స్వీకారానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించానని, తద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలకు ఒక కొత్త ప్రారంభం…

AP

వైసీపీ ముఖ్య నేతలకు సాయిరెడ్డి ఉచ్చు..?

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో కొందరు ముఖ్య నేతలకు సాయిరెడ్డి టెన్షన్ మొదలైంది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాల పైన కూటమి ప్రభుత్వం విచారణ సాగిస్తున్న వేళ సాయిరెడ్డి కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావించి.. వారికి ఉచ్చు బిగించారు. కూటమికి ఈ పరిణామాలు వరంగా మారుతున్నాయి. దీంతో, జగన్ అలర్ట్ అయ్యారు. ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. రానున్న రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.…

AP

జనసేనను మతసేనగా మార్చారు.. పవన్ కల్యాణ్‌పై షర్మిల తీవ్ర విమర్శలు..

జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. మొన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు.   పవన్, చెగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్లు వదిలేశారని.. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నట్టు కనిపిస్తోందని చెప్పారు. జనసేన పార్టీని ఆంధ్ర మత సేన పార్టీగా మార్చారని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…

TELANGANA

బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరండి, నెటిజన్లకు సజ్జనార్ పిలుపు..!

యువత ప్రాణాలు బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. తన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. బెట్టింగ్ యాప్స్ వ్యతిరేక ఉద్యమంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. బెట్టింగ్ భూతాన్ని శాశ్వతంగా రూపుమాపేందుకు ప్రతి ఒక్కరు నడుంబింగించాలని కోరారు.   బెట్టింగ్ యాప్స్ పై సజ్జనార్ సీరియస్   గత కొద్ది నెలలుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ…