News

TELANGANA

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..! సభలో కీలక బిల్లులు..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడీగా సాగను న్నాయి. 19న బడ్జెట్ రానుండడంతో ఈలోగా కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఆ బిల్లులు కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు సంబంధించినవి తెలుస్తోంది. మరోవైపు విపక్షం బీఆర్ఎస్ మాత్రం జగదీష్‌రెడ్డి అంశంపై సభను స్థంభింప చేయాలని ఆలోచన చేస్తోంది.   సభలో కీలక బిల్లులు   సోమవారం తెలంగాణ అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి…

National

ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంకర్ల దేశవ్యాప్త సమ్మె..

వారంలో ఐదు రోజుల పని దినాలతో పాటు పలు డిమాండ్లపై ఇండియన్ బ్యాంకు అసోసియేషన్స్ (ఐబీఏ)తో జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఈ నెల 24, 25 తేదీల్లో రెండు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెను ప్రకటించింది.   ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగులు, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయాలన్న అంశాలు యూఎఫ్‌బీయూ డిమాండ్లలో ఉన్నాయి. ఆర్థిక సేవల విభాగం ఇటీవలి సూచనలను ఉపసంహరించుకోవాలని, ఇవి ఉద్యోగ…

AP

తండ్రి చావుతో జగన్ సీఎం.. పిఠాపురం వేదికగా బాలినేని నిప్పులు..!

వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో ప్రసంగించిన ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగిన నేత అని అన్నారు. జగన్ మాత్రం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సభావేదికగా తన ఆవేదనను, ఆక్రోశాన్ని, రాజకీయ భవిష్యత్తును స్పష్టం చేస్తూ ఉద్వేగభరితంగా…

AP

అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అన్నారు.. 21 మంది ఎమ్మెల్యేలతో అడుగుపెట్టాం – వైసీపీకి పవన్ చురకలు.

పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తమదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రసంగం ప్రారంభంతోనే వైసీపీకి ఇచ్చి పడేశారు. ‘‘తొడలు కొట్టారు. మన ఆడపడుచులను అవమానించారు. జనాలను నిరంతరం హింసించారు. ఇదేం న్యాయం అని అడిగితే.. కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసులో బంధించారు. వాళ్ల కార్యకర్తలను రోడ్డు మీదకు రావాలంటే భయపడేలా చేశారు. వారు…

TELANGANA

గ్లోబల్ ఈవెంట్స్..! జైశంకర్‌తో రేవంత్ కీలక భేటీ..

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్‌ని కోరారు.   ఈ ఏడాది హైద‌రాబాద్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న అంత‌ర్జాతీయ కార్య‌క్ర‌మాలైన మిస్ వ‌ర‌ల్డ్‌ పోటీలు, గ్లోబ‌ల్ డీప్ టెక్ స‌ద‌స్సు, భారత్ సమ్మిట్ ఈవెంట్లు,…

TELANGANA

హోలీ వేడుకల్లో గంజాయి కుల్ఫీ, ఐస్‌క్రీమ్స్..

హైదరాబాద్‌లోని దూల్‌పేటలో హోలీ వేడుకల ముసుగులో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు ఐస్‌క్రీమ్ వంటి తినే పదార్థాల్లో గంజాయిని కలిపి విక్రయిస్తున్నాడు. లోయర్ దూల్‌పేటలోని మల్చిపురాలో కుల్ఫీ, ఐస్‌క్రీమ్, బర్ఫీ స్వీటు, సిల్వర్ కోటెడ్ బాల్స్‌లో గంజాయితో సంబరాలు చేసుకున్నారు.   సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 100 కుల్ఫీ, 72 బర్ఫీ స్వీట్లు, కొన్ని సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.…

National

మరో మైలురాయి సాధించిన ఇస్రో.. స్పేడెక్స్ డీ-డాకింగ్ ప్రక్రియ సక్సెస్..

అంతరిక్ష ప్రయాణంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అద్భుతమైన ఘనతను సాధించింది. ఇస్రో గురువారం తన స్పేడెక్స్ డీ-డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే ఈ మిషన్‌ను ఇస్రో చేపట్టింది. భవిష్యత్ లో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రకు అవసరమైన ఈ కీలక పరిజ్ఞానాన్ని ఇస్రో ఒడిసిపట్టింది.భారత అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్-4, గగన్‌యాన్ సహా భవిష్యత్ ప్రయోగాలకు ఇస్రో మార్గం సుగమం చేసినట్లు.. భారత అంతరిక్ష సంస్థకు…

AP

పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ.. పార్టీ విస్తరణ..

ఏపీ అధికారంలో భాగస్వామ్యం తర్వాత జనసేన తొలి ఆవిర్భావ సభ జరగనుంది. కేవలం రెండు కీలక అంశాలు ఎజెండాగా సాగనుంది ఈ సభ. జయ కేతనం పేరుతో జరగుతున్న ఈ ప్లీనరీలో సనాతన ధర్మ పరిరక్షణ, పార్టీ విస్తరణ ప్రధానంగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం వీటిపై ఉండనుంది.   ముస్తాబైన పిఠాపురం   జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు పిఠాపురంలోని చిత్రాడ ముస్తాబైంది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత…

AP

ఏపీలో ఇంటర్ విద్యలో కీలక మార్పులు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ విద్యలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. విద్యార్థులు ఇకపై ఎంపీసీ, బైపీసీ వంటి గ్రూపులతో పాటు ఎం బైపీసీ చదువుకునే వెసులుబాటు కల్పించింది. ఇంటర్మీడియట్‌ విద్యా మండలితో మంత్రి లోకేశ్‌ అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. 2025-26 సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యలో తీసుకురానున్న సంస్కరణలకు ఆమోదం తెలిపింది. విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకుంది.   ఇంటర్‌ విద్యలో కీలక సంస్కరణలో ఏపీ ఇంటర్ బోర్డు గ్రీన్ సిగ్నల్…

TELANGANA

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారికి ఇక నుండి చుక్కలే..!

సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. సోషల్ మీడియాలో పాపులారిటీ ఉందని అడ్డగోలుగా వ్యవహరిస్తామంటూ చట్టాలు చూస్తూ ఊరుకోవన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో ఫాలో కావద్దన్నారు. వెంటనే అలాంటి వారిని అన్ ఫాలో చేయాలని సూచించారు. “సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు అకౌంటబులిటీ అనేది ఉండాలి.…