మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి.. సీరియస్ వార్నింగ్..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సహచరులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు సరైన స్థాయిలో పనితీరు కనబరచడం లేదని, ముఖ్యంగా ప్రభుత్వ పాలన ప్రజలలోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినేట్ సమావేశంలో చంద్రబాబు.. మంత్రుల పట్ల ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పనితీరుపై అసంతృప్తి నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించినా, ఈ విషయాన్ని ప్రజలకు తగిన స్థాయిలో తెలియజేయలేకపోతున్నామన్నారు. ప్రభుత్వ నిర్వహణలో…

