News

TELANGANA

రేవంత్ రెడ్డీ… నీకు చేతనైతే చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు: హరీశ్ రావు..

సీఎం రేవంత్ రెడ్డి నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలపరిశీలనకు వెళ్లడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతికపరమైన అంశాలు నిర్లక్ష్యం చేసి ఆదరాబాదరాగా ఎస్ఎల్బీసీ పనులను పరుగెత్తించారని విమర్శించారు. కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండా వారిని మృత్యుకుహరంలోకి నెట్టారని మండిపడ్డారు. కార్మికుల ప్రాణాలు బలితీసుకుని ఇప్పుడు కుహనా ఏడ్పులు ఏడుస్తున్నారని ధ్వజమెత్తారు.   నీకు నిజాయతీ ఉంటే ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో…

AP

విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్.. 6న భువనేశ్వరి శంకుస్థాపన..

విజయవాడలో త్వరలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 6న ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భుశనేశ్వరి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. భవనం కోసం ఇటీవల 16వ జాతీయ రహదారిపై నున్న ఎల్ఈపీఎల్ మాల్ పక్కన, సాయిబాబా ఆలయ రోడ్డు జంక్షన్‌లో 600 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందులో జీప్లస్ 5 విధానంలో అత్యంత అధునాతనంగా భవనాన్ని నిర్మించనున్నారు.   ప్రస్తుతం హైదరాబాద్‌లోని…

National

పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక మహిళ ఆత్మహత్య.. ఎక్కడంటే..?

మరణించిన పెంపుడు పిల్లి మళ్లీ బతుకుతుందని మూడు రోజులపాటు వేచి చూసిన మహిళ.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మొహల్లా కోట్‌కు చెందిన పూజాదేవి (36) పదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఆ తర్వాత రెండేళ్లకే భర్త నుంచి విడిపోయింది. అప్పటి నుంచి హసాన్‌పూర్‌లో తన తల్లి, ఇద్దరు సోదరులతో కలిసి ఉంటోంది.   మూడేళ్ల క్రితం రోడ్డుపై కనిపించిన ఓ పిల్లిని తెచ్చి పెంచుకుంటోంది.…

National

కేంద్రంపై పోరుకు స్టాలిన్ కీలక నిర్ణయం..

వచ్చే ఏడాది చేపట్టే నియోజకవర్గాల పునర్ విభజన, హిందీ వివాదాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో విభేధిస్తున్న తమిళనాడు ప్రభుత్వం ఇక అమీతుమీకి సిద్ధమైంది. ఇందుకోసం మిగతా అన్ని పార్టీల్ని పోగేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే ఛీఫ్ ఎంకే స్టాలిన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారు.ఇందులో పాల్గొనాలని అన్ని పార్టీల నేతలకు సందేశాలు పంపుతున్నారు.   దేశవ్యాప్తంగా 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. ఇందులో ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లను భారీగా పెంచేస్తున్న కేంద్రం..…

AP

తిరుమల ఇక నో ఫ్లయింగ్ జోన్..? కేంద్రానికి లేఖ రాసిన టీటీడీ చైర్మన్..

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల శ్రీవారి పవిత్రతకు భంగం వాటిల్లకుండా పలు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు టీటీడీ బోర్డు ఇప్పటికే పలు తీర్మానాలు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో సమస్యకు సంబంధించి జోక్యం చేసుకోవాలని కోరుతూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.   తాజాగా తిరుమల కొండపై నుంచి వరుసగా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఎప్పటి నుంచో ఇలాగే…

AP

పోసాని గుండెనొప్పి ఫేక్- తేల్చేసిన పోలీసులు-మళ్లీ జైలుకు..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టు అయి రాజంపేట జైల్లో ఉన్న టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి అస్వస్ధతకు గురికావడం అబద్దమని తేలిపోయింది. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి గుండెనొప్పి వచ్చినట్లు జరిగిన ప్రచారం అంతా ఫేక్ అని పోలీసులు తేల్చేసారు. ఈ మేరకు రాజంపేట పోలీసులు ఓ ప్రకటన చేశారు.   ఇవాళ రాజంపేట జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి గుండె…

TELANGANA

కొచ్చి తరహాలో మామునూరు విమానాశ్రయం..

వరంగల్ మామునూరు విమానాశ్రయం కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి నిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వరంగల్ నగరానికి విమానాశ్రయం ఎక అసెట్ గా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని చెప్పారు.   విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. వరంగల్ మామునూరు…

TELANGANA

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో 8 మంది ఆనవాళ్ల గుర్తింపు, దారుణంగా లోపలి పరిస్థితులు..

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది సిబ్బందిని బయటికి తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు వివరాలను మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. గల్లంతైన వారి ఆచూకీ మరికొద్ది గంటల్లోనే లభించే అవకాశం ఉందని తెలిపారు.   టన్నెల్ వద్ద సహాయక చ్యలను పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టన్నెల్‌లో మనుషులు ఉన్నట్లు ఆనవాళ్లు కనిపించిన ప్రదేశంలో తవ్వకాలు జరుగుతున్నట్లు మంత్రి జూపల్లి వెల్లడించారు. 5-8 మీటర్ల…

AP

అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ని నేడు కలిశారు..

అమరావతి రాజధానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ని నేడు కలిశారు. అంబుల వైష్ణవి గతేడాది జూన్‌లో రాజధానికి రూ.25 లక్షలు, 2019కి ముందు పలుసార్లు కలిపి రూ.25 లక్షలను విరాళంగా అందించారు. వైష్ణవిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ సీఆర్డీయే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం ను వైష్ణవి సచివాలయంలో శుక్రవారం కలిశారు.

CINEMA

రాజమౌళికి తాంత్రిక విద్యలు కూడా తెలుసు… పోటీగా ఉన్న డైరెక్టర్లను తొక్కేశాడు: శ్రీనివాసరావు..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన టార్టర్ భరించలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ ఆయన స్నేహితుడు శ్రీనివాసరావు సంచలన వీడియో, లేఖను విడుదల చేశారు. ‘యమదొంగ’ సినిమాకు శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.   రాజమౌళితో తనకు 34 ఏళ్ల స్నేహం ఉందని శ్రీనివాసరావు చెప్పారు. ఒక అమ్మాయితో ట్రయాంగిల్ లవ్ స్టోరీతో తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని తెలిపారు. ఆమెను ముందు రాజమౌళి ప్రేమించాడని, ఆ తర్వాత తాను ప్రేమించానని చెప్పారు.…