News

National

మోదీ-జిన్‌పింగ్ భేటీ.. సరిహద్దు వివాదంపై చర్చలు..

భారత్, చైనా మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు సద్దుమణిగిన తర్వాత ఇరు దేశాల అగ్రనాయకత్వం తొలిసారిగా సమావేశమవుతోంది. చైనాలోని టియాంజిన్ నగరంలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదివారం భేటీ కానున్నారు. పది నెలల విరామం తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి చర్చలు జరపనుండటంతో ఈ సమావేశానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.   గతంలో 2024లో రష్యాలోని కజాన్‌లో జరిగిన…

TELANGANA

అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం నివేదిక.. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందుకు వీలు కల్పించేలా తెలంగాణ పురపాలక చట్టం-2019కు సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. రెండో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, పురపాలక చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.   స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ బిల్లును సభ…

TELANGANA

బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్సే అడ్డంకి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అడ్డుపడుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, గవర్నర్ తీరు కారణంగానే జాప్యం జరుగుతోందని ఆయన విమర్శించారు.   గతంలో తమ ప్రభుత్వం బీసీలకు విద్య,…

National

మోదీ చైనా టూర్ ఎఫెక్ట్.. భారత పర్యటన రద్దు చేసుకున్న ట్రంప్..

భారత్ లో ఈ ఏడాది చివర్లో జరగనున్న క్వాడ్ సదస్సుకు హాజరు కావొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సదస్సులో ట్రంప్ పాల్గొంటారని గతంలో వార్తలు వెలువడగా.. భారత్ తో ట్రేడ్ డీల్స్ విషయంపై నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ట్రంప్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది.   భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా చైనాలో పర్యటించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపింది. ఈ…

TELANGANA

భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ..

భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఈ ఉదయం 9 గంటల సమయానికి నీటిమట్టం 48 అడుగులు దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.   వరద ప్రభావంతో స్నాన ఘట్టాల ప్రాంతంలోని మెట్లు, విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. పవిత్ర స్నానాలు ఆచరించే కల్యాణ కట్ట వరకు…

National

నెహ్రూ కలలుగన్న శాంతి ఒప్పందం.. భారత్-చైనా సంబంధాల్లో కీలక అధ్యాయం..

భారత్-చైనా సంబంధాల గురించి చర్ల వచ్చినప్పుడల్లా ‘పంచశీల ఒప్పందం’ ప్రస్తావనకు వస్తుంది. ‘హిందీ-చీనీ భాయ్ భాయ్’ నినాదాలతో స్నేహానికి ప్రతీకగా మొదలైన ఈ ఒప్పందం, చివరికి రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీయడం ఒక చారిత్రక విషాదం. సుమారు 70 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఒప్పందం వెనుక ఎన్నో ఆశలు, రాజీలు, ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఉన్నాయి.   చైనాలో నెహ్రూ చారిత్రక పర్యటన 1954లో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చైనాలో…

TELANGANA

అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోతున్నారూ : హరీష్ రావు..

వరదలపై చర్చకు వస్తే అధికార కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా పారిపోతున్నారని ఆయన విమర్శించారు. బీఏసీ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండు రోజులే అసెంబ్లీ నడిపిస్తామని ప్రభుత్వం చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.   అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీలో కోరామని హరీశ్ రావు తెలిపారు. వరద నష్టాలు, ఎరువుల కొరత,…

National

ముంబయిలో రిలయన్స్ రెండు భారీ ప్రాజెక్టులు..!

రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) వేదికగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ రెండు భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. ముంబై నగరంలో ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ ప్రణాళికలను ఆవిష్కరించారు. అత్యాధునిక వసతులతో 2,000 పడకల మెడికల్ సిటీని, నగరానికి స్వచ్ఛమైన గాలిని అందించేలా 130 ఎకరాల కోస్టల్ గార్డెన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.   రిలయన్స్ లాభాపేక్ష రహిత విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెడికల్…

National

ట్రంప్ వల్ల అమెరికా పరువు పోతోంది..! యూఎస్ మాజీ అధికారులు ఫైర్..

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ అనుసరిస్తున్న మొండి విధానాలు అమెరికా బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, వ్యూహాత్మకంగా కీలకమైన భారత్‌ను చైనాకు దగ్గర చేస్తున్నాయని వైట్‌హౌస్ మాజీ ఉన్నతాధికారి, గతంలో అధ్యక్షుడు జో బైడెన్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జేక్ సలివాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.   ఇటీవల ‘ది బల్వార్క్’ అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సలివాన్, ట్రంప్ విధానాల వల్ల అంతర్జాతీయంగా…

AP

రాయలసీమకు నీళ్లు వస్తే వైసీపీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు: సీఎం చంద్రబాబు..

“రాష్ట్ర అభివృద్ధి అనే యజ్ఞాన్ని అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల్లా తయారయ్యారు. ప్రతి మంచి పనికీ తప్పుడు ప్రచారాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. చేతనైతే అభివృద్ధి, సంక్షేమంలో మాతో పోటీ పడాలి తప్ప, ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయడం సరికాదు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాల కుప్పం ప్రజల కలను సాకారం చేస్తూ, హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను నియోజకవర్గానికి తీసుకువచ్చిన చారిత్రక సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు నీళ్లు…