News

TELANGANA

జూబ్లీహిల్స్ ను ప్రధాని మోదీకి బహుమతిగా ఇద్దాం: రాంచందర్ రావు..

కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఓట్లు చోరీ చేస్తున్నారని, మజ్లిస్ పార్టీ మద్దతుతో రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం కూడా ఇదే తరహాలో ఓట్లను దొంగిలించి గెలుస్తోందని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.   ఈ సందర్భంగా ఆయన…

TELANGANA

ప్రభుత్వాలు దిగిపోవడానికి కమ్యూనిస్టులు బాగా ఉపయోగపడతారూ -: సీఎం రేవంత్..

ప్రభుత్వాలు దిగిపోవడానికి కమ్యూనిస్టులు బాగా ఉపయోగపడతారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఏ ప్రభుత్వం దిగిపోయినా, ఆ ప్రభుత్వం పోవడానికి కమ్యూనిస్టు సోదరులే కారణమని నేను బలంగా నమ్ముతున్నాను. గత ప్రభుత్వం దిగిపోవడంలో వారి పాత్ర ఎంతో ఉంది” అని అన్నారు.   అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టులు పెద్దగా సహకరించకపోయినా, అధికారం నుంచి…

National

మోదీతో జెలెన్‌స్కీ టెలిఫోన్ సంభాషణ… పుతిన్ తో భేటీకి ముందు కీలక విన్నపం..

ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు భారత్ తన వంతు పాత్ర పోషించాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. తక్షణమే కాల్పుల విరమణ జరిగేలా చూడాలని, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో రష్యాకు గట్టి సంకేతాలు పంపాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఇరువురు నేతలు ఫోన్‌లో సంభాషించారు. నెల రోజుల వ్యవధిలో మోదీ, జెలెన్‌స్కీ మాట్లాడుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.   ఈ సంభాషణ సందర్భంగా, ఉక్రెయిన్‌లోని తాజా పరిస్థితులు,…

AP

కుప్పం ప్రజలకు గుడ్ న్యూస్..! కుప్పం అభివృద్ధికి 6 కీలక ఎంవోయూలు.

ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టనుంది. పారిశ్రామికంగా కుప్పం రూపురేఖలను మార్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ఏకంగా విమానాలు, రాకెట్ల తయారీ యూనిట్లతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఫైబర్ బోర్డు పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కుప్పం పర్యటన సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థలతో మొత్తం 6 కీలక అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా కుప్పంలోకి రూ. 2,050 కోట్లకు…

CINEMA

‘బిగ్ బాస్ సీజన్ 9’ అఫీషియ‌ల్‌ లాంచింగ్ డేట్ వ‌చ్చేసింది..

తెలుగు టెలివిజన్ చరిత్రలో సరికొత్త ప్రయోగానికి బిగ్ బాస్ సిద్ధమైంది. ఈసారి ఒకే ఇంట్లో కాకుండా, ఏకంగా రెండు ఇళ్లలో ఈ రియాలిటీ షో సందడి చేయనుంది. ‘సెలబ్రిటీలు వర్సెస్ సామాన్యులు’ అనే వినూత్న థీమ్‌తో బిగ్ బాస్ సీజన్ 9 ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. ఈ మేరకు నిర్వాహకులు అధికారికంగా ప్రోమో విడుదల చేయడంతో షోపై అంచనాలు భారీగా పెరిగాయి.   అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ తొమ్మిదో సీజన్, సెప్టెంబర్ 7వ తేదీ…

NationalTechnology

ఆకాశంలో అద్భుతం.. సెప్టెంబర్ 7న ‘బ్లడ్ మూన్’.. హైదరాబాద్ నుంచీ వీక్షించే అవకాశం..

ఖగోళ అద్భుతాల కోసం ఎదురుచూసేవారికి ఇది ఒక శుభవార్త. వచ్చే నెలలో ఆకాశంలో ఒక అరుదైన, కనువిందు చేసే దృశ్యం ఆవిష్కృతం కానుంది. సెప్టెంబర్ 7-8 తేదీల రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు సాధారణం కంటే భిన్నంగా, ఎర్రటి నారింజ రంగులో ప్రకాశిస్తూ కనిపిస్తాడు. అందుకే దీనిని ‘బ్లడ్ మూన్’ లేదా రక్త చంద్రగ్రహణం అని పిలుస్తారు. దాదాపు 82 నిమిషాల పాటు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించే అవకాశం కలగనుంది.…

TELANGANA

తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు సర్వీసు పొడిగింపు..

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు సర్వీసును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. పదవీ విరమణ చేయవలసి ఉండగా, ఆయన సర్వీసును పొడిగించాలని డీవోపీటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది.   రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం మరో ఏడు నెలల పాటు రామకృష్ణారావు సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనితో 2026 మార్చి వరకు రామకృష్ణారావు తెలంగాణ ప్రభుత్వ…

AP

ఏపీలో రూ. 53 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం..! ఏపీలో కొలువుల జాతర..!

ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ఎస్ఐపీబీ వేగంగా పారిశ్రామిక ప్రాజెక్టులు పూర్తవ్వాలన్న ముఖ్యమంత్రి ఏరో స్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులు రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు నవంబర్ 15లోగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక…

APSPORTS

ఏపీలోని అంతర్జాతీయ క్రీడాకారులకు గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్జాతీయ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్‌లో ఉన్న క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేసింది. రాష్ట్రానికి చెందిన 43 మంది అంతర్జాతీయ క్రీడాకారులకు రూ.4.9 కోట్ల నగదు ప్రోత్సాహకాలను విడుదల చేసినట్టు అధికారికంగా ప్రకటించింది.   చాలాకాలంగా ఎదురుచూస్తున్న బకాయిలు విడుదల కావడంతో క్రీడాకారులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ నిర్ణయంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్‌) ఛైర్మన్‌ రవినాయుడు హర్షం వ్యక్తం చేశారు. క్రీడలు,…

AP

ఏపీలో ఇక ప్రతి ఇంటికి ఫ్యామిలీ కార్డు..! ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల పంపిణీని మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ ఆధార్ కార్డు తరహాలో ఒక ప్రత్యేక ‘ఫ్యామిలీ కార్డు’ను జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఈరోజు ‘ఫ్యామిలీ బెనిఫిట్‌ మానిటరింగ్‌’ వ్యవస్థపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని సూచించారు.   ఈ కొత్త ఫ్యామిలీ కార్డులో ఆ…