News

AP

చెత్త పన్నుకు ముగింపు పలికిన ఏపీ ప్రభుత్వం..

వైసీపీ ప్రభుత్వ హయాంలో విధించిన చెత్త పన్నును ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 31 నుంచి చెత్త పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మున్సిపల్ చట్ట సవరణ తర్వాత గెజిట్ విడుదల చేసింది. ఏపీలో ఇకపై చెత్త పన్ను ఉండదు.   వైసీపీ ప్రభుత్వం చెత్త పన్నును విధించినప్పటి నుంచి అప్పుడు విపక్షంలో ఉన్న నేతలు విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. ఎన్నికల ప్రచారంలో సైతం…

TELANGANA

హరీశ్ రావుపై కక్షగట్టి ఇరికించాలని చూస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుపై కక్షగట్టి… నేర చరిత్ర ఉన్న చక్రధర్ అనే వ్యక్తితో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని… కరోనా సమయంలో ఆరోగ్య మంత్రిగా ఎన్నో సేవలు అందించారని చెప్పారు. ఏదో ఒకటి చేసి…

AP

ఏపీని జగన్ అప్పులకుప్పగా మార్చడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి: పవన్ కల్యాణ్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీల నేతలు సమన్వయంతో కలిసి ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.   వెన్ను నొప్పి కారణంగానే రాష్ట్రంలో తాను కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని తెలిపారు. తనకు ఇప్పటికీ వెన్ను నొప్పి బాధిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి…

AP

మిర్చి ధర పతనంపై కేంద్రంతో మాట్లాడా… ఆందోళన వద్దు: ఢిల్లీలో చంద్రబాబు..

మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధరలు తగ్గడంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ధరలు భారీగా పడిపోయాయన్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్ బాగుండటంతో రైతులకు మంచి ధర వచ్చిందన్నారు.   ప్రస్తుతం అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయాయని, మిర్చి రైతుల సమస్యలను కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లానని ఆయన అన్నారు. కేంద్రమంత్రి పర్యటనలో ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా…

TELANGANA

హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్‌ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ..

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్ బంజారా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో హోటల్ ప్రధాన ద్వారాలకు తాళాలు వేశారు. రోడ్డు నెంబర్ 1లో గల తాజ్ బంజారా హోటల్ రూ.1.43 కోట్ల మేర పన్ను బకాయి పడిందని అధికారులు పేర్కొన్నారు.   పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ హోటల్ యాజమాన్యం స్పందించలేదని అధికారులు తెలిపారు. చివరిగా రెండు రోజుల గడువు ఇచ్చినప్పటికీ హోటల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో,…

TELANGANA

కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్..

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్… అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. ఫార్మర్స్ ఫెడరేషన్ కు చెందిన విజయ్ పాల్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.   ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడాలని, అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే సభ్యత్వంపై వేటు వేయాలని విజయ్ పాల్ రెడ్డి కోరారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్…

CINEMA

రామ్ చరణ్ మూవీలో ప్రగ్యా జైస్వాల్..?

RC 16.. ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) అనగానే అందరికీ బాలయ్య(Balakrishna ) హీరోయిన్ అనే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బాలయ్యకు జోడీ గా అఖండ(Akhanda ), డాకు మహారాజ్ (Daaku Maharaj) సినిమాలలో నటించింది. ఈ రెండు సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న ఈమె.. అఖండ 2 లో అవకాశం దక్కించుకుంది. బోయపాటి శ్రీను(Boyapati Sreenu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ (Samyuktha menon) నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. కానీ ప్రగ్యా…

AP

నంద్యాల్ టు విజయవాడ ఆర్టీసీ బస్సులో 13 తులాల బంగారం అపహరణ..

ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామానికి చెందిన కిషోర్ అనే వ్యక్తి ఫ్యామిలీ తిరుణాల నిమిత్తం అహోబిలం వెళ్లి తిరిగి వస్తుండగా గాజులపల్లి సమీపంలో విజయవాడ బస్సులో గిద్దలూరు వరకు ప్రయాణం చేస్తుండగా 13 తులాల బంగారం అపహరణ అయిందని బాధితులు తెలిపారు..   పూర్తి వివరాలు పోలీసు ల విచారణలో తెలియాల్సింది…….

AP

ఏపీలో టీచర్ల బదిలీలకు సన్నాహాలు..

అమరావతి : ఏపీలో ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో చేపట్టనున్న డిఎస్సీ నిర్వహణ సన్నద్ధతపైనా లోకేష్ చర్చించారు.  

National

ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా గురించిన ఆసక్తికర వివరాలు..!

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లను బీజేపీ కైవసం చేసుకుని ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.   ఢిల్లీకి కాబోయే సీఎం రేఖా గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడం గమనార్హం. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఆమె అత్యున్నత సీఎం పదవిని చేపట్టబోతున్నారు. విద్యార్థి దశ నుంచే రేఖా గుప్తా నాయకురాలిగా ఎదిగారు. ఢిల్లీ…