News

National

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్.. ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషి..

భారత ఎన్నికల సంఘం నూతన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గత రాత్రి వేర్వేరుగా రెండు గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లలో సీనియర్ అయిన జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా ఎంపిక చేశారు. జ్ఞానేశ్ కుమార్ స్థానంలో ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషిని ఎంపిక చేశారు. మరో ఈసీగా సుఖ్‌బీర్ సింగ్ ఉన్నారు.   అంతకుముందు ప్రధానమంత్రి…

NationalTechnology

యూజర్ల కోసం కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చిన ఫోన్ పే..

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్స్‌ను ప్రారంభించింది. ఫోన్‌పే వినియోగదారులు యాప్‌లో తమ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, ప్రయాణ టికెట్ల బుకింగ్, బీమా కొనుగోలు, పిన్ కోడ్ ఆధారిత చెల్లింపులు సులభంగా చేసుకోవచ్చు.   ఫోన్‌పే వినియోగదారులు తమ కార్డులను టోకనైజ్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇకపై ప్రతి లావాదేవీకి తమ…

National

హమాస్ సంచలన ప్రకటన.. గాజాను వదులుకునేందుకు రెడీ..!

ఇజ్రాయెల్‌లో మారణహోమాన్ని సృష్టించి.. తద్వారా యుద్ధానికి కారణభూతమైన హమాస్ సంచలన ప్రకటన చేసింది. గాజా స్ట్రిప్ పై అధికారాన్ని వదులుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈజిప్ట్ ఒత్తిడితోనే హమాస్ ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. గాజాలో ప్రస్తుతం పోలీస్, ఆరోగ్యం, పౌరసేవలు అన్నీ హమాస్ నియంత్రణలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడి అధికారాన్ని పాలస్తీనా అధికార యంత్రాంగానికి బదలాయించేందుకు అంగీకరించింది. కాగా, హమాస్ నిర్ణయం వెనక డొనాల్డ్ ట్రంప్ విధానం కూడా ఒక కారణమని తెలుస్తోంది.   పాలస్తీనా…

TELANGANA

సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ.. సర్వత్ర ఉత్కంఠ..

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది.   గత విచారణ సందర్భంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సమాధానంగా……

CINEMA

పోలీస్ స్టేషన్ వద్ద మంచు మనోజ్ నిరసన .. ఎందుకంటే..!

సినీ నటుడు మంచు మనోజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల మనోజ్ తిరుపతిలోని విద్యాసంస్థలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అడ్డుకున్న విషయం తెలిసిందే.   తాజాగా మంచు మనోజ్ పోలీసుల తీరును నిరసిస్తూ తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశాడు. సోమవారం రాత్రి 11.15 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఆయన…

AP

అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టండి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 1,392 పోలీస్ స్టేషన్లు ఉంటే… కేవలం 1,001 స్టేషన్లలోనే సీసీ కెమెరాలు ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. మిగిలిన స్టేషన్లలో కెమెరాలు ఎందుకు పెట్టలేదని నిలదీసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని పీఎస్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న సీసీ కెమెరాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని…

AP

త్వరలో ఏపీకి 5 సంస్థలు…2 వేల కోట్ల పెట్టుబడులు..

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ఐదు సంస్థలు ముందుకు వచ్చాయని, చేనేత రంగంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. త్వరలో ఆ సంస్థలతో ఎంవోయూలు చేసుకోబోతున్నామని, ఆయా కంపెనీల ఏర్పాటుతో 15 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్‌లో మంత్రి సవిత రెండో రోజు సోమవారం కూడా పాల్గొన్నారు.   ఈ…

TELANGANA

ఉప ఎన్నికలు ఖాయం.. సిద్ధంగా ఉండండి: కేటీఆర్..

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నెల 10వ తేదీన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈమేరకు ప్రశ్నించింది. స్పీకర్ సమయం నిర్దేశించకుంటే… తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై…

TELANGANA

హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి సీరియస్..

హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా నిబంధనలు ఎందుకు పాటించరు? చట్టివిరుద్ధంగా కూల్చివేతలు చేస్తారా?.. సెలవు రోజు కూల్చివేతలు చేయడం అలవాటుగా మారిందని హైకోర్టు మండిపడింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగిలో సెలవు రోజు (ఆదివారం) ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించిన షెడ్ ను అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా కూడా అతనికి నమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టి అక్కడి హైడ్రా…

TELANGANA

రాష్ట్రానికి కేంద్ర సాయం సున్నా.. పోరాటానికి సిద్దం కావాలని సీఎం పిలుపు..

కేంద్రం నుండి తెలంగాణకు వస్తున్న సాయం శూన్యమని, త్వరలో కేంద్రంపై పోరాటం చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో శుక్రవారం జరిగిన యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా సీఎం సంచలన కామెంట్స్ చేశారు.   సీఎం మాట్లాడుతూ.. హనుమంత రావు యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్ లో పని చేశారన్నారు.…