నార్త్ యూరప్‌లో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్ ప్రారంభం!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్లను అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. కొంతకాలం నిలిచిపోయిన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ తిరిగి గాడిలో పడేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా, ఈ నెల మూడో వారంలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ నార్త్ యూరప్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. అక్కడి మంచుతో కప్పబడిన పర్వత…

