News

TELANGANA

తెలంగాణలో బెనిఫిట్ షోలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం నడుచుకోవాలని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది.   సినిమా టిక్కెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతులపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది.   ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు తెలిపారు.   వాదనలు విన్న…

APNational

వందో ప్రయోగానికి శ్రీహరికోట సిద్ధం.. నావిక్-2 ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వందో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 29న సాయంత్రం 6.23 గంటలకు శ్రీహరికోట సతీశ్‌ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి నావిక్-2 ఉప గ్రహాన్ని ప్రయోగించనుంది. దాదాపు 2,500 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ద్వారా నింగిలోకి పంపనున్నారు.   శ్రీహరికోటలో రాకెట్ కేంద్రం నిర్మించిన తర్వాత చేపడుతున్న వందో ప్రయోగం ఇది. అంతేకాదు, ఈ ప్రయోగానికి మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. నింగిలోకి…

TELANGANA

మంద కృష్ణ మాదిగ అక్రమ కట్టడాల కూల్చివేత…

వరంగల్ జిల్లాలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు చెందిన అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. హన్మకొండలోని హంటర్ రోడ్డు సర్వే నెంబర్ 125కేలోని ఆయన కట్టడాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ సిబ్బంది నిన్న కూల్చివేశారు.   హంటర్ రోడ్డులో గల తమ 400 గజాల భూమిని మంద కృష్ణతో పాటు జ్యోతి, ఇద్దయ్యలు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారని రెండున్నరేళ్ల క్రితం నంబూరి చారుమతి అనే మహిళ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ జరిపి…

National

ట్రంప్ తో చర్చలకు పుతిన్ రెడీ..

దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్చువల్‌‌గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఆయుధాలను తగ్గించే దిశగా ప్రపంచ దేశాలు పని చేయాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నారు. రష్యా, చైనాలు కూడా వారి అణ్వాయుధ సామర్థ్యాలను తగ్గించుకోవడానికి మద్దతు ఇస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.   ఈ తరుణంలో రష్యా నుంచి కీలక ప్రకటన వెలువడింది. డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించేందుకు తమ అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారంటూ…

AP

విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు కుట్రలు చేశారు: కాకాణి గోవర్ధన్ రెడ్డి..

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… తమ పార్టీలో విజయసాయి రెడ్డి కీలక నేత అని చెప్పారు. జగన్ సీఎం కావాలని ఆయన కలలు కన్నారని… ఇప్పుడు రెండోసారి జగన్ ను సీఎం చేసేందుకు పని చేస్తున్నారని అన్నారు. విజయసాయిపై కొందరు టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేశారని…

AP

ముంబై దాడుల నిందితుడి అప్పగింతకు ఓకే చెప్పిన అమెరికా సుప్రీంకోర్టు..

ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడిని భారత్ కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. తనను భారత్ కు అప్పగించకుండా అడ్డుకోవాలంటూ నిందితుడు తహవుర్ రాణా దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో రాణా దోషిగా తేలిన నేపథ్యంలో నేరస్థుల అప్పగింత నుంచి మినహాయింపు పొందలేడని స్పష్టం చేసింది. తహవుర్ రాణాను అప్పగించాలంటూ భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది.   అయితే, రాణా…

TELANGANA

మహిళా కలెక్టర్‌ను అవమానించారు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: కవిత డిమాండ్..

మహిళా కలెక్టర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవమానించారని, ఇందుకు మంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు తక్షణమే కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నిన్న కరీంనగర్ జిల్లా పర్యటనలో మహిళా కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మీద మంత్రి చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన కవిత… తీవ్రంగా స్పందించారు.   ఇది కాంగ్రెస్‌ నాయకుల అహంకారానికి పరాకాష్ఠ అని…

National

ఒకరినొకరు పెళ్లి చేసుకున్న మహిళలు.. యూపీలో ఘటన..

భర్త నిత్యం తాగి వచ్చి తిడుతూ కొడుతుండడంతో విసిగిపోయిందో మహిళ.. తనలాంటి బాధితురాలు ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం కావడంతో స్నేహం పెంచుకుంది. భర్తల ఆగడాలను ఇక భరించలేక ఇద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోయి ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు.   ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ వింత పెళ్లి గురించిన వివరాలు.. యూపీకి చెందిన మహిళలు కవిత, గుంజ అలియాస్ బబ్లూలకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకేరకమైన సమస్యతో…

AP

జగన్ రెడ్డి, విజయసాయి కలిసి ఆడుతున్న డ్రామా ఇది: బుద్దా..

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. విజయసాయి రాజీనామా అంశంపై ఇటు అధికార టీడీపీ, అటు ప్రతిపక్ష వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ఇది జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. జగన్ కు తెలిసే అంతా జరుగుతుందన్నారు. వీళ్లిద్దరి కేసులు పక్కదారి పట్టించడానికి ఆడుతున్న నాటకం…

National

మణిపుర్‌లో బిజెపికి జేడీయూ షాక్..

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారినట్లుగా కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజేపీ)కి ఇంతవరకు మద్దతు ప్రకటించిన జనతా దళ్ యునైటెడ్ (జేడియూ).. తాజాగా తన మద్దతును ఉపసంహరించుకున్నట్లు ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు జేడీయూ పార్టీ మణిపూర్ అధ్యక్షుడు క్షేత్రమయుం బీరెన్ సింగ్ (ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కాదు) ప్రకటన జారీ చేశారు. మణిపూర్ లో తమ పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతోందని.. తమ పార్టీకి…