News

AP

నేను అబద్ధం చెబితే వెంకటేశ్వరస్వామి నన్ను శిక్షిస్తాడు: విజయసాయిరెడ్డి..

కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా షేర్లను బదలాయించుకున్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) అనే వ్యక్తి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేయడం తెలిసిందే. సీఐడీ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నేడు విజయసాయిరెడ్డి హైదరాబాదులో ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను ఆరు గంటల పాటు ప్రశ్నించారని, 25 ప్రశ్నలు అడిగారని వెల్లడించారు. కేవీ…

National

బెంగళూరులో హెచ్ఎంపీవీ కేసులు… ఐసీఎంఆర్ స్పందన..

కరోనా మహమ్మారి దెబ్బకు హడలిపోయిన ప్రపంచ దేశాలను మరో వైరస్ కలవరపెడుతోంది. దాని పేరు హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమా వైరస్). చైనాలో ఈ వైరస్ తీవ్రస్థాయిలో ప్రబలుతోందంటూ ఇటీవల కథనాలు వచ్చాయి.   తాజాగా, భారత్ లోనూ హెచ్ఎంపీవీ వైరస్ కలకలం రేగింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు తేలింది. ఈ నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆసక్తికరంగా స్పందించింది. ప్రపంచ దేశాల్లోనే కాకుండా, భారత్ లోనూ ఈ వైరస్ వ్యాప్తిలో…

TELANGANA

ప్రారంభమైన చర్లపల్లి టెర్మినల్..

దాదాపు 100 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరంలో రూపుదిద్దుకున్న మరో నూతన రైల్వేస్టేషన్ చర్లపల్లి టెర్మినల్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్ గా ప్రారంభించారు. రూ.428 కోట్లతో ఆధునికీకరించిన ఈ టెర్మినల్ లో తొమ్మిది ప్లాట్ ఫామ్స్, ఐదు ఎస్కలేటర్లు, తొమ్మిది లిఫ్ట్ లు, రెండు ఫుట్ ఓవర్ వంతెనలు అందుబాటులోకి వచ్చాయి. క్రమక్రమంగా కొన్ని ప్రధానమైన దూర ప్రాంత రైళ్లను ఈ టెర్మినల్ కు మార్చబోతున్నారు. ప్రయాణికులు ఈ స్టేషన్ కు చేరుకునేందుకు ఎంఎంటీఎస్ సర్వీసులను…

TELANGANA

ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మన్మోహన్ పేరు.

హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు మరో భారీ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఆరాంఘర్ – జూ పార్క్ ఫ్లై ఓవర్ ను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ. 799 కోట్ల వ్యయంతో ఫ్లై ఓవర్ ను జీహెచ్ఎంసీ నిర్మించింది. మొత్తం ఆరు లైన్లతో 4.8 కిలోమీటర్ల పొడవు, 23 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ ను నిర్మించారు.   ఆరాంఘర్…

National

దేశీయంగా ప్రభుత్వ బడుల్లో భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య..

దేశంలోని ప్రభుత్వ పాఠశాల్లలో విద్యార్థుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైందని కేంద్ర పాఠాశాల విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రెండు యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+) నివేదికల్ని విడుదల చేసింది. ఇందులో 2018-19 తో పోల్చితే 2023-24 విద్యా ఏడాదిలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యలోని తగ్గుదలను ప్రస్తావించింది.   UDISE+ అనేది ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచి హయ్యర్ సెకండరీ వరకు పాఠశాల విద్యార్థులకు సంబంధించిన అన్ని…

AP

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు కిశోర్ అరెస్ట్..

మాచర్లలో టీడీపీ నేతలపై జరిగిన దాడిలో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురగా కిశోర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.   ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కిశోర్ ను ఈ రోజు హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు.   ఇక వైసీపీ అధికారంలో…

APCINEMA

కల్కి అలాంటి మూవీ.. హిందూ ధర్మ వినాశనం..సినిమా వాడిగా సిగ్గు పడుతున్నా..

తెలుగు చలన చిత్ర పరిశ్రమపై ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిప్పులు చెరిగారు. తెలుగు సినిమాలతో హిందూ ధర్మ వినాశనం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా ఓ సినిమా పరిశ్రమకు చెందిన వాడినే అయినప్పటికీ- తప్పును తప్పుగా చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టే కాదని అన్నారు.   విజయవాడలో హైందవ శంఖారావం సభ   విజయవాడ కేసరపల్లిలో ఏర్పాటైన హైందవ శంఖారావం మహాసభలో అనంత శ్రీరామ్ పాల్గొన్నారు.…

TELANGANA

హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరో కీలక నిర్ణయం.. ఈసారి

హైడ్రా (Hydra) కమిషనర్ రంగనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం హైదరాబాద్ నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని నిర్ణయించారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు.   అయితే, ఫిర్యాదు చేసే ముందు పూర్తి ఆధారాలు, వివరాలతో రావాలని కమిషనర్ రంగాథ్ సూచించారు. ఈ…

TELANGANA

ఉద్యోగాల భర్తీ పై సీఎం రేవంత్ కీలక ప్రకటన..!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. తెలంగాణ నుంచి అధిక సంఖ్య సివిల్స్ లో రాణించే లా ప్రభుత్వ తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాది లోనే 55143 ఉద్యోగ నియామకాలు చేపట్టామని వివరించారు. ఉద్యోగ కల్పనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పుకొచ్చారు. గ్రూపు -1 నియామకాల భర్తీ గడువు పైనా సీఎం రేవంత్ కీలక ప్రకటన చేసారు.   ముఖ్యమంత్రి రేవంత్ సివిల్స్ సర్వీసు అభ్యర్ధులకు అభయం…

National

చైనాలో మరో వైరస్.. కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త.. భారత్ ప్రభుత్వం హెచ్చరిక..

కొవిడ్ తో ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన చైనాలో ఇప్పుడు మరో వైరస్ కేసులు నమోదవడం ఆందోళకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనాలోని పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించాలని.. ఒకవేళ ఆ కేసులు భారత్ లోకి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన చికిత్సలపై దృష్టిపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు.. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ బోర్డును కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది.   దేశంలో శ్వాసకోశ లక్షణాలు, ఇతర ఫ్లూ కేసులతో ఆసుపత్రులకు…