News

TELANGANA

హైదరాబాద్ లో బుర్జ్ ఖలీఫా..?

దుబాయ్ నగరంలో ప్రముఖ ఐకానిక్ సింబల్‌గా ఉన్న బుర్జ్ ఖలీఫా టవర్ లాంటిదాన్ని హైదరాబాద్ శివారులో ఉనికిలోకి రానున్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లోనూ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈనెల 13 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్‌లలో పర్యటించనున్న ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను పారిశ్రామికవేత్తలకు ప్రదర్శించి నిర్మాణం కోసం ముందుకు రావాల్సిందిగా కోరే అవకాశమున్నది.   గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా ఫోర్త్ సిటీ,…

TELANGANA

టెన్త్ మార్కులిస్టులపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్పోర్ట్స్ వివరాలు కూడ..

హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ విధానం అమల్లో ఉన్న కాలంలో మార్కుల లిస్టుతో పాటే క్రీడారంగం (ఫిజికల్ ఎడ్యుకేషన్) లోనూ విద్యార్థుల వివరాలు ఉండేవని, మళ్లీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రాథమిక స్థాయిలో ఆలోచిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తండ్రి సుభాష్ చంద్రబోస్ 1964లో హెచ్ఎస్‌సీ పూర్తిచేసినప్పుడు పాఠశాల జారీచేసిన మార్కుల సర్టిఫికెట్‌లో రన్నింగ్ రేస్, హై జంప్, లాంగ్ జంప్, బాల్ త్రోయింగ్ తదితర క్రీడల్లో చూపిన ప్రతిభను కూడా…

AP

ఏపీలోని ఆ నగరాలలో డబుల్ డెక్కర్ మెట్రో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం మరియు విజయవాడ మెట్రో ప్రాజెక్టులపైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విశాఖ మరియు విజయవాడలో తొలి దశ మెట్రో ప్రాజెక్టులపై డీపీఆర్ లు సిద్ధం చేశారు. రెండు నగరాలలోనూ డబుల్ డెక్కర్ విధానంలో 25 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టులకు నిర్మించే అంశం పైన సమీక్ష సమావేశం నిర్వహించారు..   మెట్రో ప్రాజెక్ట్ లపై అధికారులతో…

AP

విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు..

వైసీపీ హయాంలో కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌, కాకినాడ సెజ్‌లోని ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితులపై ఈడీ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనయుడు వై. విక్రాంత్‌రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు శరత్‌చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా చెప్పుకొస్తున్న పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్‌ఎల్‌పీ ప్రతినిధులకు సైతం ఈడీ ఇటీవలే నోటీసులు జారీ చేసింది. పలు కారణాలతో వీరంతా విచారణకు హాజరుకాకపోవటంతో మరోసారి వైసీపీ రాజ్యసభ…

NationalSPORTS

శుభ్ మన్ గిల్‌, సాయి సుదర్శన్‌లకు సీఐడీ సమన్లు..!

రూ. 6వేల కోట్ల‌ పోంజీ స్కామ్ గుజ‌రాత్‌తో పాటు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడీ కుంభ‌కోణం సెగ‌ క్రికెట‌ర్ల‌ను తాకింది. అధిక వ‌డ్డీ ఆశ‌చూపి ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి రూ.6వేల కోట్లు జ‌మ చేసిన బీజెడ్ గ్రూప్ అధినేత భూపేంద్ర సింగ్ ఝ‌లాను ఇప్ప‌టికే సీఐడీ అదుపులోకి తీసుకుంది.   కాగా, బీజెడ్ గ్రూపులో ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజ‌రాత్ టైటాన్స్ ఆట‌గాళ్లు పెట్టుబ‌డి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. గుజ‌రాత్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్‌, సాయి సుద‌ర్శ‌న్‌,…

AP

టీడీపీకి చెందిన 7 కుటుంబాలను వెలివేసిన గ్రామ పెద్దలు..

కాలం మారుతున్నా కొందరి మనస్తత్వాలు మాత్రం మారడం లేదు. పాత పోకడలను కొనసాగిస్తూ పంతాలకు పోతున్నారు. కక్షలతో సాటి మనుషుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఏడు కుటుంబాలను గ్రామ పెద్దలు వెలివేశారు. గ్రామ బహిష్కరణ విధించారు. గ్రామస్తులెవరూ వారికి సహకరించకూడదని, శుభకార్యాలకు, పనులకు పిలవకూడదని ఆదేశించారు. గ్రామ బహిష్కరణకు గురైన కుటుంబాలన్నీ టీడీపీకి చెందినవే కావడం గమనార్హం.   వివరాల్లోకి వెళ్తే……

AP

తల్లికి వందనం, రైతు భరోసా అమలు ముహూర్తం ఫిక్స్..!

ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు పైన స్పష్టత ఇచ్చారు. అమరావతిలో నిర్మాణ పనులతో సహా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. అదే విధంగా మున్సిపల్ తో సహా పలు చట్ట సవరణలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ నెల 8న విశాఖ లో జరిగే ప్రధాని పర్యటన పైన మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు. డీఎస్సీ నియామక ప్రక్రియ పైన చర్చ జరిగింది.…

TELANGANA

సీఎంఆర్ కాలేజీ బాత్రూం వీడియోల ఘటన… విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్..

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని కండ్లకోయ సీఎంఆర్ మహిళా కాలేజీ హాస్టల్ ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటాగా స్వీకరించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. సీఎంఆర్ మహిళా కాలేజీ హాస్టల్లో బాత్రూంలోని దృశ్యాలను చిత్రీకరించిన అంశంపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీని మహిళా కమిషన్ ఆదేశించింది.   కాగా, సీఎంఆర్ మహిళా కాలేజీ హాస్టల్‌లో బాత్రూంల పక్కనే వంట గది ఉంది. బాత్రూం దృశ్యాలను వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు ఆరోపిస్తూ విద్యార్థినులు నిన్న మధ్యాహ్నం…

TELANGANA

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రైతు భరోసా దరఖాస్తుకు సిద్దం కండి..

తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురుచూస్తున్న ఆ పథకంపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. కొత్త ఏడాదిలో వరుస శుభవార్తలు చెప్పేందుకు సీఎం రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం అమలుపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.   2025 జనవరి నెలలో ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను…

AP

మచిలీపట్నం పీఎస్ లో విచారణకు హాజరైన పేర్ని జయసుధ..

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని అర్ధాంగి పేర్ని జయసుధ నేడు మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్ నుంచి 378 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైనట్టు అధికారులు గుర్తించారు.   ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు నిన్న నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరవ్వాలని పేర్కొన్నారు.   ఈ…