News

National

తొలి రోజే దేశవ్యాప్తంగా రైతన్నలపై కేంద్రం వరాల జల్లు..

నూతన ఏడాది ప్రారంభమైన తొలి రోజే దేశవ్యాప్తంగా రైతన్నలపై కేంద్రం వరాల జల్లు కురిపించింది. రైతాంగ సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి, కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా రైతన్నలకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.   కొత్త సంవత్సరంలో కేంద్ర కేబినెట్ సమావేశాన్ని జనవరి ఒకటో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ, హాజరు కాగా రైతన్నలకు సంబంధించిన పలు పథకాలపై సుదీర్ఘ…

TELANGANA

న్యూ ఇయర్‌ అలర్ట్‌.. 4 గంటల నుంచే డ్రంకెన్‌ డ్రైవ్‌.. 10,000 ఫైన్, ఆరు నెలలు జైలు శిక్ష

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ సిద్ధమైంది. కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేందుకు నగర వాసులు రెడీ అయ్యారు. యువతను ఆకట్టుకునేందుకు పబ్‌లు, ఈవేంట్‌ ఆర్గనైజర్లు.. వివిధ ఆఫర్లతో తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు ముగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లోని 34 పబ్బుల్లో నాలుగు పబ్బులకు అనుమతి నిరాకరించారు. హాట్‌ కప్‌, అమ్నేషియా, బ్రాండ్‌ వే, బేబీ లాండ్‌ పబ్బుల్లో నూతన సంవత్సర…

National

బంగాళాఖాతంపై గ్లాస్ బ్రిడ్జి- సూర్యోదయం ఇక మరింత అందం..

ఇంకొన్ని గంటల్లో ఈ ప్రపంచం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. ఎన్నో కొత్త ఆశలతో 2025 రాబోతోంది. కొత్త ఏడాదిని స్వాగతం పలకడానికి భారత్ సహా అన్ని దేశాలు సంసిద్ధం అయ్యాయి. ఒక్కో దేశం ఒక్కో విధంగా కొత్త ఏడాదిలో ఎంట్రీ ఇవ్వబోతోంది.   కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి కొత్త ఏడాది వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు చాలామంది. ఈ క్రమంలో పలు ఆధ్యాత్మిక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో…

TELANGANA

రైతుభరోసా అమలు వారికే- పరిమితి, మార్గదర్శకాలు..!

తెలంగాణ ప్రభుత్వం రైతుభరోసా పైన కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశం పై సుదీర్ఘంగా చర్చించింది. ఈ పథకం అమలు అర్హుల ఖరారు పైన కొన్ని ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. సాగు చేసిన మొత్తం విస్తీర్ణం మేరకు ఇవ్వాలా .. లేక, ఆదాయ పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలా అనేది చర్చించారు. అదే సమయంలో పరిమితి పైనా కసరత్తు చేసారు. సంక్రాంతికి రైతుభరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం…

TELANGANA

రేవంత్ సర్కార్ కు గుడ్ న్యూస్ చెప్పిన స‌త్య నాదెళ్ల‌..

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టే అన్ని కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామిగా ఉండాల‌నే త‌మ నిబద్ధతను కొన‌సాగిస్తామ‌ని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్ల తెలిపారు. హైద‌రాబాద్‌లోని స‌త్య నాదెళ్ల నివాసంలో ఆయ‌న‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమ‌వారం భేటీ అయింది. ఈ సంద‌ర్భంగా నైపుణ్యాభివృద్ధి, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విష‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దార్శ‌నిక‌త‌ను స‌త్య నాదెళ్ల ప్ర‌శంసించారు.   నైపుణాభివృద్ది, మెరుగైన మౌలిక‌ వ‌స‌తులే ఆర్థికాభివృద్ధికి దోహ‌ద‌ప‌డి హైదరాబాద్‌ను ప్రపంచంలోని…

AP

కూటమి సర్కార్ గుడ్ న్యూస్..! మహిళలకు ఉచిత బస్సుకు ముహుర్తం ఫిక్స్..!

ఏపీలో కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ మాత్రం ఇప్పటివరకూ అమలు కాలేదు. దీనిపై ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేసి వచ్చారు. ఆ వివరాలను ఇవాళ మరోసారి సీఎం చంద్రబాబుతో అధికారులు చర్చించారు. ఇందులో ఎప్పటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించాలన్న దానిపై ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం.   ఏపీలో కూటమి సర్కార్ సూపర్-6లో భాగంగా మరో…

National

నేడు అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు: కేంద్ర హోంశాఖ..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.  ఉదయం 11.45 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరుగుతాయని తెలిపింది. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్ర రక్షణ శాఖను కోరినట్టు ఈ మేరకు ఓ ప్రకటనలో కేంద్ర హోంశాఖ తెలిపింది.   కేంద్ర కేబినెట్ సంతాపం   మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర కేబినెట్ సంతాపం…

AP

వైసీపీకి మరో షాక్..! సీమ నేత గుడ్‌బై ..

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు నాయకులు. పలు జిల్లాల్లో పార్టీ ఖాళీ అవుతోంది. బడా నాయకులు సైతం గుడ్‌బై చెబుతున్నారు. మాజీ మంత్రులు-ఎంపీలు- ఎమ్మెల్యేలు- ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా బయటికెళ్తోన్నారు.   ఎన్నికల ఫలితాలు వెలువడిన తొలి రోజుల్లోనే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తరువాత రాజీనామాల పర్వం…

AP

డెడ్ బాడీ పార్శిల్ కేసులో.. వెలుగులోకి సంచలన నిజాలు..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డెడ్ బాడీ పార్శిల్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరిగింది. సినిమాను తలపించే సస్పెన్స్, థ్రిల్లింగ్ ట్వి్స్టులతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలోని తన వదినకు.. చెక్కపెట్టెలో డెడ్ బాడీ పార్శిల్ చేశాడు శ్రీధర్ వర్మ. ఆస్తి కోసమే వదిన తులసిని బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది.   భార్య రేవతి, ప్రియురాలు సుష్మతో కలిసి శ్రీధర్…

TELANGANA

రేపో మాపో బీజేపీ కొత్త అధ్యక్షుడి ప్రకటన.. రేసులో మరో ఇద్దరు..

సార్వత్రిక ఎన్నికలు కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉన్నాయా? తెలంగాణలో ఇప్పటివరకు కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎందుకు నియమించ లేదు? రేవంత్ సర్కార్‌ని ఎదుక్కోవాలంటే బలమైన వ్యక్తి కావాలని భావిస్తోందా? రేపో మాపో కొత్త అధ్యక్షుడిపై ప్రకటన రానుందా? మరో ఇద్దరు ఎంపీలు అధ్యక్ష ఈ రేసులో ఉన్నారా? రాజకీయ కోణంలో పరిశీలన చేస్తోందా? అవుననే అంటున్నాయి కమలం వర్గాలు.   బీజేపీలో దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికల హడావుడి నడుస్తోంది. ప్రస్తుతం కమిటీల ఎన్నికలపై జోరుగా కసరత్తు సాగుతోంది.…