బీజేపీకి రాజాసింగ్ రాజీనామా..! కారణం అదేనా..?
తెలంగాణ బీజీపీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన, ఇకపై బీజేపీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజాసింగ్ ఈ మధ్యాహ్నం తన మద్దతుదారులతో కలిసి…

