టీవీ చానెల్ ఆఫీస్‌పై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి..!
వార్తలు చెప్పే వాళ్ల మీదే ఇప్పుడు వార్తలే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఘర్షణాత్మకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని మహా టీవీ కార్యాలయం వద్ద ఊహించని ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ ప్రసారం చేసిన కథనాలకు నిరసనగా BRS కార్యకర్తలు రోడ్డెక్కారు. కానీ అది నిరసనతో ఆగకుండా.. ఏకంగా ఆఫీసులోకి జొరబడి, అద్దాలు పగులగొట్టారు, కార్లను ధ్వంసం చేశారు, స్టూడియోకు హాని కలిగించారు. కొన్ని నిమిషాల్లోనే…

