స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని.. డీకే అరుణ సంచలన వాఖ్యలు..!
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ధైర్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆమె ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమంపై గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ఎకరాల భూమి ఉన్న చిన్న రైతులకు కూడా రైతు భరోసా అందించడంలో విఫలమైందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు భరోసా పేరుతో సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని, ఇది కాంగ్రెస్ నేతలకే తెలియాలని…

