News

TELANGANA

ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్.. సిట్ చేతికి కీలక ఆధారాలు..

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు పురోగమిస్తున్న కొద్దీ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో జరిగిన పలు ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసి, సమాచారం సేకరించి, కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అప్పటి ఉన్నతాధికారుల పాత్రపై కూడా సిట్ దృష్టి సారించింది.సమాచారం ప్రకారం, 2018 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్…

TELANGANA

కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా..

రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో కొనసాగుతున్న విచారణ వాయిదా పడింది. ఈ భూములకు సంబంధించి దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై (పిల్) విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.   వివరాల్లోకి వెళితే, కంచ గచ్చిబౌలిలోని వివాదాస్పద భూములను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు (టీజీఐఐసీ) అప్పగించింది. ఈ భూములను అభివృద్ధి చేసి,…

AP

కారు కింద పడిన వ్యక్తిని లాగి పక్కన పడేశారు.. జగన్ ట్వీట్ కు హోంమంత్రి అనిత కౌంటర్..

పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్‌పై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రవర్తన దారుణంగా దిగజారిపోయిందని ఆమె మండిపడ్డారు. సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ, జగన్ వ్యాఖ్యలు సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని, రాజకీయ నాయకుల మాటలను ప్రజలు నిశితంగా గమనిస్తారని…

National

పాకిస్థాన్‌కు మరోమారు వార్నింగ్ ఇచ్చిన రాజ్‌నాథ్ సింగ్..

ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని, ఇకపై ఉగ్రవాదానికి భారత్ బాధితురాలిగా మిగిలిపోదని, ఉగ్ర చర్యలకు శక్తియుక్తులతో వ్యూహాత్మకంగా బదులిస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో నార్తర్న్ కమాండ్ వద్ద సైనికులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్న వారికి నవభారతం దృఢంగా, నిశ్చయంగా ఉందని, ఉగ్రవాదానికి బాధితురాలిగా ఉండబోదని, శక్తితో, వ్యూహంతో ప్రతిస్పందిస్తుందని బలమైన సందేశం పంపామని అన్నారు.…

AP

మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు .. లోకేష్ సీరియస్ యాక్షన్..

భీమవరంలో కొంతమంది ఆకతాయిలు ప్రతి రోజూ రెచ్చిపోతున్నారు. మద్యం సేవించి వారు చేస్తున్న ఆగడాలకు అంతులేకుండాపోతోంది. గురువారం సాయంత్రం నారాయణ కాలేజీ భీమవరం వన్‌టౌన్ సీఎమ్‌ఆర్ వద్ద.. నారాయణ కాలేజీ బస్సులో విద్యార్ధినిని కొట్టి, దుర్భాషలాడి, రోడ్డుపై వీరంగం సృష్టించారు. బస్సులో వెళ్తున్న నన్ను ఎందుకు కొట్టావ్ అని ఆ విద్యార్ధి ప్రశ్నించగా.. విద్యార్ధినిపై దాడికి దిగారు ఆకతాయిలు. విద్యార్ధి బస్సు ఎక్కి వెళ్లిపోయినా.. ఆకతాయిలు మాత్రం బస్సును వెంబడించి, నడిరోడ్డుపై విద్యార్ధులను వెకిలి సేష్టలు చేస్తూ…

APTELANGANA

చంద్రబాబుతో చర్చలకు రేవంత్‌రెడ్డి సిద్ధం..!

ఏపీతో ఎలాంటి వివాదాలు తాను కోరుకోవడం లేదని.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి భేషజాలు లేవని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు. గోదావరి జలాలపై రెండు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఫ్లడ్ వాటర్ తరలిస్తే బాగుంటుందని సూచించారు. గోదావరి, కృష్ణా నీటిని తరలించాలనే నిర్ణయమే మేజర్ సమస్య అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై ఈ నెల 23న…

AP

విశాఖపట్నం తీరాన.. అంతర్జాతీయ యోగా దినోత్సవం..!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుంది. విశాఖ తీరంలో అంతర్జాతీయ యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ భారీ ఈవెంట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో పాల్కొన్నారు. ప్రపంచ దేశాలను ఏకం చేసిన ఘతన యోగాది అన్నారు ప్రధానమంత్రి మోడీ. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. యోగాసనాలు సాధన చేశారు. కోట్ల మంది జీవితాల్లో యోగ…

TELANGANA

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక క్వారీ యజమానిని బెదిరించారన్న ఆరోపణలపై ఆయనపై ఈ చర్యలు తీసుకున్నారు.   వివరాల్లోకి వెళితే… కౌశిక్ రెడ్డిపై క్వారీ యజమానిని బెదిరించినట్లుగా ఆరోపణలు రావడంతో వరంగల్‌ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం ఆయనను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం తదుపరి…

TELANGANA

యూకేకి బయల్దేరిన కేటీఆర్..! ఎందుకంటే..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి జరగనున్న ‘ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం 2025’ సదస్సులో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించనున్నారు.   ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే ప్రధాన ఇతివృత్తంతో ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా కేటీఆర్, గతంలో తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి తీసుకున్న చర్యలు, రాష్ట్ర అభివృద్ధి కోసం…

AP

షర్మిల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించిన జగన్..! ఏమన్నారంటే..?

తెలంగాణలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ రాజకీయ వేడిని రాజేస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలు ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవమేనని, ఆ సమాచారాన్ని కేసీఆర్, జగన్ పంచుకున్నారని షర్మిల ఆరోపించారు. తన ఫోన్‌తో పాటు, తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.   ఈ ఆరోపణలపై జగన్ తాడేపల్లిలో జరిగిన…