News

AP

ఏపిలో భారీ పెట్టుబడులు.. సోలార్ ప్యానెల్స్ తయారీ ప్లాంట్‌..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుపుతామన్నారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. మంత్రితో వివిధ దేశాలకు చెందిన పునరుత్పాదక విద్యుత్ రంగ పారిశ్రామికవేత్తలు పలువురు శుక్రవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలు, ఇండస్ట్రియల్ పాలసీలపై చర్చించారు.   ఈ సందర్భంగా సియెల్ సోలార్ (SAEL SOLAR) కంపెనీ ప్రతినిధులు.. 600…

TELANGANA

తెలంగాణ తల్లి తలపై కిరీటం ఎందుకు పెట్టలేదో చెప్పిన అందెశ్రీ..

దేవత రూపానికైతే కిరీటం ఉంటుందని, కానీ అమ్మరూపానికి ఉంటుందా? అని ప్రజావాగ్గేయకారుడు అందెశ్రీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాలో బతుకమ్మతో పాటు కిరీటం లేకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కిరీటం లేకపోవడంపై ఎన్టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అందెశ్రీ స్పందించారు. బాసర సరస్వతీమాతను దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు.   తెలంగాణ తల్లికి కిరీటం ఉండాలంటే… భూమి మీద పురుడు పోసుకున్న ఏ తల్లికి కిరీటం ఉంటుందో చెప్పాలన్నారు. కిరీటాలు పెట్టుకుంటే…

TELANGANA

తెలంగాణ సచివాలయంలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం..

తెలంగాణ సచివాలయంలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. డిసెంబరు 12వ తేదీ నుంచి రాష్ట్ర సచివాలయంలో ఈ నిబంధన అమలు చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.   స‌చివాల‌యంలో ప‌ని చేసే అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బందికి ఈ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం వర్తిస్తుందని ఆ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్, స‌చివాల‌యం హెడ్ నుంచి వేత‌నాలు పొందే ప్ర‌తి ఉద్యోగికి వర్తిస్తుందని స్పష్టం చేశారు.

AP

అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన చేయడంతో పాటు, అమరావతి రాజధానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి కొలువుదీరిన కూటమి ప్రభుత్వం.. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా పేర్కొంటూ నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా రాజధానిలో అభివృద్ధి పనులు మొదలు పెట్టింది.  …

AP

వైసీపీ పార్టీకి మరో భారీ షాక్.. వైసీపీకి అవంతి శ్రీనివాస్ రాజీనామా..!

వైసీపీ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్, ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా మీడియాతో అవంతి మాట్లాడుతూ… పార్టీ అధ్యక్షుడు జగన్ పై విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే… ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి కనీసం ఒక ఏడాది సమయం ఇవ్వాలని చెప్పారు. ఐదు నెలల…

National

ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి బిల్లు..?

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న కేంద్రం.. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన జమిలి ఎన్నికల ప్రతిపాదనపై పార్లమెంటరీ కమిటీ అభిప్రాయం కోరిన కేంద్రం.. దాన్ని సభలో మాత్రం ప్రవేశపెట్టలేదు. దీంతో ఈ ప్రతిపాదనతో పాటు జమిలి ఎన్నికల బిల్లును కూడా ఒకేసారి ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లు సమాచారం.   ఈ నెల 20 వరకూ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి.…

TELANGANA

చెన్నమనేని రమేష్‌పై హైకోర్టు ఆగ్రహం..

బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ఎట్టకేలకు షాక్ తగిలింది. పౌరసత్వం కేసులో చెన్నమనేని దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ దేశ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని స్పష్టం చేసింది. కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.   జర్మనీ పౌరసత్వంతోనే ఆయన అక్కడికి వెళ్లారని పేర్కొంది. అంతేగాక, చెన్నమనేని…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు.. ప్రభాకర్‌ పై హరీష్ రావు ఒత్తిడి..

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు పోలీసులు. కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ రావు బెయిల్ పిటిషన్‌కు సంబంధించిన ఈ కౌంటర్ అఫిడవిట్‌లో కీలక విషయాలు పొందుపరిచారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి నలుగురు నిందితులు బేగంపేట ఎస్ఐబీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు పోలీసులు. బేగంపేట హరిత ప్లాజా, మ్యారీ గోల్డ్ హోటల్, జూబ్లీహిల్స్‌లోని శ్రవణ్ రావు ఇంట్లోనూ పలు అంశాలపై చర్చించేందుకు వీరు భేటీ అయ్యారని వివరించారు.   బీఆర్ఎస్ సర్వేతో…

AP

మోహన్‌బాబు ఫ్యామిలీ ఇష్యూ…!

సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా, మంచు మనోజ్ భార్య మౌనిక ఫోన్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తానని హెచ్చరించినట్లుగా అందులో ఉంది.   తన భర్త మనోజ్ సెక్యూరిటీని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బౌన్సర్లను కానిస్టేబుళ్లు పంపించేశారని పేర్కొన్నారు. ఈ సమయంలో తమ బౌన్సర్లను బయటకు ఎలా పంపుతారని…

AP

నాగబాబుకు మంత్రి పదవి.. చంద్రబాబు కీలక నిర్ణయం..

మెగా బ్రదర్ నాగబాబు మంత్రి పదవి చేపట్టడం ఖాయమైంది. నాగబాబుకు రాజ్యసభ చాన్స్ ఇస్తారంటూ జరిగిన ప్రచారానికి నేటితో తెరపడింది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు.   ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా, పాతికమంది మంత్రులకు అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబు క్యాబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం…