పంచాయతీ ఎన్నికలు.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ దిశగా కసరత్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి సీతక్క చేసిన ప్రకటన ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. జూలై నెలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ, “రాబోయే జూలై నెలలో సర్పంచ్…

