‘అఖండ 2’ మాస్ తాండవం: నైజాంలో రికార్డుల మోత, ప్రీమియర్ వసూళ్లు అంచనాలు!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను (Boyapati srinu) కాంబినేషన్ అంటే టాలీవుడ్లో ప్రత్యేక మాస్ క్రేజ్. ఈ ఇద్దరి సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఉత్సాహం అసలు తగ్గదు. అదే జోష్‌తో వచ్చిన అఖండ 2 తాండవం ప్రీమియర్స్ రోజే బాక్సాఫీస్‌ను కుదిపేసింది. ఈ మాస్ యాక్షన్, డివోషనల్ ఎంటర్టైనర్ తొలి ప్రదర్శనలకే అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది. నైజాం ప్రాంతంలో ప్రీమియర్స్ టికెట్లు ₹600 రూపాయల దాకా ఉండటం చూసి కొందరు ఆశ్చర్యపోయినా, థియేటర్ల వద్ద…

