హిందువులపై పాక్ అధ్యక్షుడు జర్దారీ వ్యాఖ్యలు.. పాత పేరుతో చురక అంటించిన జావేద్ అక్తర్..
ప్రముఖ కవి, బాలీవుడ్ సినీ గీత రచయిత జావేద్ అక్తర్ మరోసారి పాకిస్థాన్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్‌లోని హిందూ మైనారిటీల గురించి ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. జర్దారీపై ఉన్న పాత అవినీతి ఆరోపణలను గుర్తుచేస్తూ, ‘మిస్టర్ 10%’ అంటూ ఎద్దేవా చేస్తూ ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు.అసలేం జరిగిందంటే..పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ…

