రాజీనామా చేయనంటున్న మమత.. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఈసీ నోటిఫికేషన్..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజ్యాంగపరమైన ప్రక్రియలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో కొత్త శాసనసభ ఏర్పాటుకు సంబంధించి భారత ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను అధికారులు గవర్నర్‌కు సమర్పించడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసినట్లయింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా గవర్నర్ వద్దకు చేరడంతో, మెజారిటీ సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే మార్గం సుగమమైంది. మరోవైపు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి…

