ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..! వివరాలు ఇవిగో..
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తును మార్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో యువతకు ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం అడుగులు వేసింది. మొత్తం రూ. 39,436 కోట్ల విలువైన భారీ పారిశ్రామిక పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఐటీ హబ్‌గా విశాఖ..…

