15 నెలల యుద్ధానికి స్వస్తి.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన డీల్…
ఇజ్రాయెల్-హమాస్ మధ్య 15 నెలలుగా జరుగుతున్న యుద్ధానికి ఫుల్‌స్టాప్ పడింది. ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్ తమ దళాలను వెనక్కి తీసుకునేందుకు ఓకే చెప్పగా, తమ అధీనంలో ఉన్న బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ మిలిటెంట్ గ్రూప్ అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. ఈజిప్ట్, ఖతర్, ఇజ్రాయెల్‌తో కలిసి తాము కొన్ని నెలలపాటు జరిపిన దౌత్యం అనంతరం ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు…

