నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం..! రాజధాని అమరావతిలో అదనపు భూసేకరణపై చర్చ..!
నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. దీనికి- ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహించనున్నారు. సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. రాజధాని అమరావతిలో అదనపు భూసేకరణ సహా పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నట్లు సమాచారం. త్వరలో అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉన్నందున.. వీటికి సంబంధించిన అంశాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నాయి. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదిస్తుందని తెలుస్తోంది. గతంలో సీఆర్డీఏ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై…

