తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యల కొరడా: రాజా సింగ్ తర్వాత సీఎంపై పొగడ్తల వర్షం కురిపించిన పాయల్ శంకర్!
తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కట్టుతప్పుతున్నారనే విమర్శలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గతంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి సస్పెండ్‌కు గురయ్యారు. సస్పెన్షన్ వేటు పడ్డాక కూడా ఆయన ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. అయినా రాజా సింగ్ విషయంలో బీజేపీ నాయకత్వం ఏమీ చేయలేకపోతోందన్న వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా ఉంది. తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే…

