ఫ్యూచర్ సిటీకి తొలి అడుగు.. కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్..
తెలంగాణాను ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తు ముఖచిత్రాన్ని మార్చబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం 150 రోజుల రికార్డు సమయంలో ఫ్యూచర్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని పూర్తి…

