తెలంగాణలో పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్..!
తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక చర్యలు చేపట్టింది. గత ఆరేళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా, కేవలం రిజిస్టర్డ్ పార్టీలుగా మాత్రమే కొనసాగుతున్న 13 పార్టీలకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో ఆదేశించింది.రాష్ట్రంలో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉండి ఆరేళ్లకు పైగా ఏ ఎన్నికల బరిలోనూ నిలవని పార్టీలను జాబితా…