News

TELANGANA

ఆపరేషన్ సిందూర్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..!

ఏప్రిల్ 22, పహల్గాం ఉగ్రదాడి తర్వాత జాగ్రత్తగా గమనిస్తే.. ఇద్దరు రాజకీయ నేతలు మిగతా వారందరి కంటే ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఆ ఇద్దరు మన తెలుగు నాయకులే కావడం గర్వకారణం. ఒకరు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మరొకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. టెర్రర్ అటాక్‌ బాధితులకు నివాళిగా పార్టీ తరఫున 3 రోజులు సంతాప దినాలను నిర్వహించారు జనసేనాని. బాధిత తెలుగు కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. పార్టీ తరఫున 50 లక్షల పరిహారం అందించారు.…

TELANGANA

క్లైమాక్స్‌లో ఆపరేషన్ కగార్‌,..!

ఆపరేషన్ సిందూర్‌తో సరిహద్దులు ఎరుపెక్కాయి. ఆపరేషన్ కగార్‌తో కర్రెగుట్టల రక్తమోడాయి. కర్రెగుట్టల్లో కాల్పుల మోత మోగుతూనే ఉంది. చంద్రన్న దళంతో భద్రత బలగాలు భీకర యుద్ధమే చేస్తున్నాయి. నూగూరు శివారు పెద్దగుట్ట దగ్గర భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 4 గంటల పాటు హోరాహోరాగా ఫైరింగ్ కొనసాగింది. మావోయిస్టుల తూటాలకు ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అదే ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్నతో సహా 22 మంది మావోయిస్టులు హతమయ్యారు.…

AP

ఏపీ లిక్కర్ స్కాం లో ఈడి ఎంట్రీ..! వైసీపీకి అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైందా..?

వైసీపీకి అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైందా? లిక్కర్ కేసులో నేతలకు దారులు మూసుకుపోతున్నాయా? నిన్నటికి నిన్న ముగ్గురు నిందితులకు ముందస్తు బెయల్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తాజాగా ఈ కేసులోని ఈడీ ఎంటరైంది. దీంతో వైసీపీ కీలక నేతల్లో అసలు టెన్షన్ మొదలైంది. ఇక తమ పని అయిపోయినట్టేనని అంటున్నారు.   వైసీపీ నేతలు బెంబేలు   వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. ఈ కేసుపై ప్రాథమిక విచారణ జరిపిన ఈడీ,…

National

పాకిస్తాన్ కు బిగ్ షాక్.. పట్టుబడ్డ పైలట్..!

రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ ప్రాంతంలో భారత వైమానిక దళం పాకిస్తాన్ పైలట్‌ను సజీవంగా పట్టుకుంది. ఈ ఘటన మరింత ఆసక్తిని రేపుతోంది, ఎందుకంటే అదే సమయంలో కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ నుండి డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి.   ఢీకొన్న పాకిస్తాన్ విమానాలు.. జైసల్మేర్, అఖ్నూర్ ప్రాంతాల్లో రెండు పాకిస్తాన్ విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే, భారత వైమానిక దళం సమర్థవంతంగా స్పందించి, పాకిస్తాన్ పైలట్‌ను పట్టుకోగలిగింది. భారత వైమానిక దళం ఈ…

National

కరాచీ పోర్టుపై భారత్ దాడి.. పోర్టులో ఏడు భారీ పేలుళ్లు..

పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తోంది. భారత పౌరులను లక్ష్యంగా దాయాది దేశం దాడులు చేస్తోంది. పరిస్థితి గమనించిన భారత్ సైన్యం మూడు వైపులా పాకిస్తాన్‌ను చుట్టుముట్టింది. కేవలం ఎల్ఓసీ వెంబడి మాత్రమే కాకుండా ఆరేబియా సముద్రం వైపు భారత నేవీ రౌండప్ చేసింది. పాకిస్తాన్‌కు సమాచారం చేరుకునే లోపు కరాచీ పోర్టుపై మిస్సైల్ వర్షం కురిపించింది భారత నేవీ.   వార్ మొదలైంది?   పాకిస్థాన్‌ వాణిజ్యం కేంద్రానికి అత్యంత కీలకమైనది కరాచీ…

National

స్వదేశీ ఆకాశ్ క్షిపణి సత్తా.. పాకిస్థాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్న భారత్..

భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత లక్ష్యాలపై పాక్ చేసే కుయుక్తులను భగ్నం చేయడంలో ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ ఆయుధం కీలక పాత్ర పోషిస్తోందని ఏఎన్ఐ వార్తా సంస్థకు అధికారులు తెలిపారు.   భారత సాయుధ దళాలు “మేడ్ ఇన్ ఇండియా” ఆకాశ్ ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే వాయు రక్షణ క్షిపణి…

National

బలూచిస్థాన్‌లో బీఎల్‌ఏ దాడి.. 14 మంది పాక్ సైనికుల మృతి..

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి నెత్తురు పారింది. వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో మొత్తం 14 మంది పాకిస్థానీ సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు బలూచిస్థాన్‌లో తీవ్రమవుతున్న తిరుగుబాటును, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి.   బోలాన్ జిల్లాలోని మాచ్ ప్రాంతంలోని షోర్కాండ్ వద్ద సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని బీఎల్‌ఏ స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (ఎస్‌టీవోఎస్) రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీతో దాడికి…

NationalTechnology

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు..!

టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ భారతదేశంలో తన కార్యకలాపాలు ప్రారంభించే దిశగా కీలక ముందడుగు వేసింది. కేంద్ర టెలికం విభాగం నుంచి ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ అందుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో దేశంలో చౌక ధరలకే వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు మరింత మెరుగయ్యాయి.   శాటిలైట్ కమ్యూనికేషన్ ఆపరేటర్ల కోసం నిర్దేశించిన నూతన జాతీయ భద్రతా మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని స్టార్‌లింక్…

National

భారత్ దాడిలో పీవోకేలోని జల విద్యుత్ కేంద్రం ధ్వంసం.. ..

భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కీలకమైన నీలం-జీలం జలవిద్యుత్ ప్రాజెక్టు (ఎన్‌జేహెచ్‌పీ)ను లక్ష్యంగా చేసుకుని భారత దళాలు దాడులు చేశాయని, ఈ ఘటనలో ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని పాకిస్థాన్ ఆరోపించింది. మే 6, 7 తేదీల మధ్య రాత్రి ఈ దాడులు జరిగినట్లు పాకిస్థాన్ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో పౌర ప్రాణనష్టం కూడా జరిగిందని పాక్ పేర్కొంది.   పాకిస్థాన్ ప్రముఖ వార్తా సంస్థ ‘డాన్’ కథనం…

National

పాకిస్థాన్ లాహోర్ లో వరుస పేలుళ్లు… తీవ్ర భయాందోళనల్లో లాహోర్ ప్రజలు..

పాకిస్థాన్‌లోని లాహోర్ నగరం ఈ ఉదయం వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. సైనిక విమానాశ్రయానికి సమీపంలో మూడు శక్తివంతమైన విస్ఫోటనాలు సంభవించడంతో స్థానికులలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.   లాహోర్‌లోని వాల్టన్ రోడ్డులో ఉన్న ఒక సైనిక విమానాశ్రయానికి వెలుపల ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పెద్ద శబ్దాలతో కూడిన ఈ పేలుళ్ల అనంతరం, సమీపంలోని భవనాల నుండి దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో ప్రజలు…