News

AP

విద్యుత్ శాఖపై జగన్ ప్రభుత్వం రూ. 1.25 లక్షల కోట్ల అప్పు చేసింది: మంత్రి గొట్టిపాటి..

దేశ భద్రత విషయంలో ప్రజలందరూ ఏకతాటిపై నిలుస్తుంటే, రాష్ట్ర ప్రగతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం ఆసక్తి ఉండటం లేదని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ తన సొంత ప్రచార సాధనాల ద్వారా నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేస్తున్నారని, అయితే ప్రజలు ఇటువంటి తప్పుడు ప్రచారాలను విశ్వసించరని ఆయన స్పష్టం చేశారు.   గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పీక్ అవర్స్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ. 9.38 చొప్పున కొనుగోలు…

National

‘ఆపరేషన్ సిందూర్’.. 80 మంది ఉగ్రవాదుల హతం..!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట నిర్వహించిన ఈ కచ్చితమైన దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు అత్యున్నత స్థాయి భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.   నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ),…

National

పాకిస్థాన్ ఉగ్రమూకలపై దాడులకు ‘సిందూర్’ పేరే ఎందుకు..?

భారతదేశంపై ఉగ్ర దాడులకు కుట్రలు పన్నుతున్న, వాటిని నిర్దేశిస్తున్న పాక్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట చేపట్టిన ఈ చర్యలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.   భారత సాయుధ దళాలు అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఇందులో భాగంగా, పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్, మురిడ్కే, సియాల్‌కోట్ వంటి ప్రాంతాల్లో…

National

“ఆపరేషన్ సిందూర్”: ఉమ్మడి మీడియా సమావేశంలో కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖల అధికారులు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు “ఆపరేషన్ సిందూర్” పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో తొమ్మిది ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు. ఈ చర్య ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహిస్తున్నవారికి గట్టి హెచ్చరిక అని ఆయన స్పష్టం చేశారు.   సోమవారం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విక్రమ్ మిశ్రీ,…

National

ఆపరేషన్ సిందూర్… జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి, బావ సహా 10 మంది కుటుంబ సభ్యుల మృతి..

పాకిస్థాన్ భూభాగం మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత భద్రతా దళాలు ఈ తెల్లవారుజామున దాడులు చేపట్టాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన ఈ చర్యల్లో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మరణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి.   తెల్లవారుజామున 1.05 గంటల సమయంలో, పాకిస్థాన్ మరియు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు క్షిపణులతో విరుచుకుపడ్డాయి. జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి…

TELANGANA

హైదరాబాద్‌లో ‘మిస్ వరల్డ్’ సందడి షురూ..!

హైదరాబాద్ నగరం మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక కానుంది. మే 10వ తేదీ నుంచి 31 వరకు చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్ (ఖిల్వత్ ప్యాలెస్)లో ‘మిస్ వరల్డ్-2025’ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా చార్మినార్‌తో పాటు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సముదాయాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.   సౌత్ జోన్ పోలీసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విదేశీ ప్రతినిధులు, సందర్శకుల…

TELANGANA

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సర్వం సిద్ధం..?

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టు(పార్ట్-బి)కు సంబంధించి డీపీఆర్ రెడీ అయ్యింది. రేవంత్ మంత్రివర్గం వచ్చే వారం ఆమోదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు మేడ్చల్‌, జూబ్లీ బస్ స్టేషన్ నుండి షామిర్‌పేటకు విస్తరించనుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి అనుసంధానించే మెట్రో కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ను కేబినెట్ ఆమోదించనుంది.   ఈ ఏడాది జనవరి ఒకటిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును నూతన సంవత్సర గిఫ్ట్‌గా ప్రకటించారు. ప్యారడైజ్ నుండి మేడ్చల్ వరకు…

National

అడ్డదారుల్లో మన దేశంలోకి తన ఉత్పత్తులను పంపించేందుకు యత్నిస్తున్న పాకిస్థాన్..

ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి దిగుమతులపై భారత్ పూర్తిస్థాయిలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిషేధాన్ని తప్పించుకుని, తమ ఉత్పత్తులను ఎలాగైనా భారత మార్కెట్లోకి చేర్చేందుకు పాకిస్థాన్ ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి.   విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సుమారు 500 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ముఖ్యంగా పండ్లు, ఎండు ఖర్జూరాలు, వస్త్రాలు,…

National

ప్రతీకారానికి సిద్ధంగా ఉన్నా వాయుసేన, నేవీ..! ప్రధానితో భేటీ..!

పహల్గమ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత వాయుసేన (ఐఏఎఫ్) సంసిద్ధత, ప్రభుత్వ ప్రతిస్పందన వ్యూహాలపై ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో వాయుసేన పరంగా అందుబాటులో ఉన్న ప్రతీకార అవకాశాలపై ప్రధానికి ఆయన వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.   ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో జరిగిన ఈ సమావేశంపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, దేశ భద్రతా పరిస్థితులు, ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతీకార చర్యల…

AP

లిక్కర్ స్కాంపై మరో బాంబు పేల్చిన కేశినేని నాని.. !

రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిన కేశినేని సోదరుల మధ్య ఆరోపణల యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని తన సోదరుడు, ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై సంచలన ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న మద్యం కుంభకోణంలో అరెస్టయిన కీలక వ్యక్తులతో కేశినేని చిన్నికి సంబంధాలున్నాయని నాని ఆరోపించారు. ఈ మేరకు రాసిన లేఖను ఆయన…