ప్రధాని మోదీ విదేశీ పర్యటన.. 8 రోజులు, 5 దేశాల్లో పర్యటన..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. జులై 2వ తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు రెండు ఖండాల్లోని ఐదు దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలను సందర్శిస్తారు. బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతో పాటు, గ్లోబల్ సౌత్‌లోని కీలక దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్ఠం చేసుకోవడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.…