News

AP

భోగాపురం విమానాశ్ర‌యం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్‌వే.. ఈ గడ్డపై అడుగుపెట్టడం ఎంతో గర్వకారణం: ప్రధాని మోదీ..

పవిత్రమైన ఉత్తరాంధ్ర గడ్డపై అడుగుపెట్టడం తనకు ఎంతో గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సహా సుమారు రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో, తెలుగులో అందరికీ నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు అర్పించారు. నేటి రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, ముఖ్యంగా స్వర్ణాంధ్ర విజన్‌లో ఒక కీలకమైన రోజని అభివర్ణించారు.  …

AP

భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ వార్.. వైసీపీ కీలక ట్వీట్..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇవాళ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయింది. మరోవైపు, ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంపై వైసీపీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు సాకారమవ్వడంపై మాజీ సీఎం జగన్ తరఫున ప్రజలకు వైసీపీ ధన్యవాదాలు తెలిపింది. ఈ ప్రాజెక్టుకు పునాది వేసి, కల నుంచి నిజం దిశగా నడిపించిన నాయకుడు ఎవరో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసని పేర్కొంది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులు ఎలాంటి పాత్ర లేకుండానే మొత్తం…

National

గూగుల్ సరికొత్త ఆవిష్కరణ.. మానవుల్లా ఆలోచించే రోబోలు..!

టెక్నాలజీ దిగ్గజం గూగుల్, రోబోటిక్స్ రంగంలో ఒక సంచలన ముందడుగు వేసింది. తన డీప్‌మైండ్ ల్యాబ్స్ నుంచి ‘జెమినీ రోబోటిక్స్ 2’ అనే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది హ్యూమనాయిడ్ రోబోల (మానవ రూపాన్ని పోలిన రోబోలు) కోసం ఒక ‘మెదడు’లా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. దీని సహాయంతో రోబోలు కేవలం చెప్పిన పనిని పదేపదే చేయడం కాకుండా, స్వయంగా ఆలోచించడం, పరిసరాలను అర్థం చేసుకోవడం, సంక్లిష్టమైన పనులను పూర్తిచేయడం వంటివి చేయగలవు.…

TELANGANA

“క్రిమినల్ వేస్ట్”.. ఇంజినీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..

తెలంగాణలోని ఇంజినీరింగ్ విద్యార్థుల ఉపాధి నైపుణ్యాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి.   హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిఏటా 1.1 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేస్తున్నప్పటికీ, వారిలో కొందరు కనీసం ఉద్యోగ దరఖాస్తును కూడా నింపలేకపోతున్నారని ఆయన…

TELANGANA

హైడ్రా నుంచి రంగనాథ్‌ను వెంటనే బదిలీ చేయండి: హైకోర్టు తాజా ఉత్తర్వులు..

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను, ఆయన్ను తక్షణమే ఆ పదవి నుంచి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తాజాగా, రంగనాథ్ స్థానంలో మరొక అధికారిని నియమించాలని నేడు ఉత్తర్వులు జారీ చేసింది.   లోతుకుంట భూముల వ్యవహారంలో హైడ్రాకు, శాంత శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన…

AP

పెమ్మసానిపై ఏఐ వీడియో.. అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదు..

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ఒక ఏఐ-జనరేటెడ్ వీడియోను పోస్ట్ చేశారన్న ఆరోపణలపై గుంటూరులోని మంగళగిరి సీఐడీ కార్యాలయంలో ఈ కేసు రిజిస్టర్ చేశారు.   కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చేతులకు సంకెళ్లు వేసినట్టుగా ఉన్న ఒక ఏఐ వీడియోను అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో ద్వారా పెమ్మసాని…

AP

సీదిరి అప్పలరాజుకు ఎదురుదెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు..

మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు కోర్టులో చుక్కెదురైంది. తన కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన ఆయనకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. సీదిరి అప్పలరాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీంతో ఆయన జైల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది.   వివరాల్లోకి వెళితే.. జులై 10వ తేదీన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పాత జాతీయ రహదారిపై అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ…

National

వందేమాతరం బిల్లుకు లోక్ సభ ఆమోదం..

జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించడం లేదా దాని గానానికి ఆటంకం కలిగించడాన్ని నేరంగా పరిగణించే కీలక బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం ముద్ర వేసింది. జాతీయ గౌరవ పరిరక్షణ (సవరణ) బిల్లు, 2026ను ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. నిన్న ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది.   1971 నాటి జాతీయ గౌరవ పరిరక్షణ చట్టానికి ఈ బిల్లు సవరణలు చేపడుతుంది. ఇప్పటివరకు జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం ‘జన…

AP

మంచిర్యాల జిల్లాలో వింత… వర్షంతో పాటు ఆకాశం నుంచి చేపలు..!

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బుధవారం కురిసిన భారీ వర్షం ఓ అరుదైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. వర్షపు నీటితో పాటు చిన్నపాటి చేపలు వీధుల్లోకి కొట్టుకురావడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. రోడ్లపై కనిపిస్తున్న ఆ చేపలను పట్టుకోవడానికి పిల్లలు, యువకులు పోటీపడ్డారు.   పట్టణంలోని పుప్పాల హనుమాన్ వీధిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. కుండపోత వర్షం కారణంగా వీధులన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో వరద నీటిలో చేపలు కొట్టుకురావడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. కొందరు ఇవి…

AP

అబద్ధానికి చొక్కా, ప్యాంటు వేస్తే చంద్రబాబే: కాకాణి గోవర్ధన్..

తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంపై వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో ఏమీ సాధించకుండా టీడీపీ నేతలు ఏ మొహం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్తారని ఆయన ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు ప్రజలకు తమ ముఖం కూడా చూపించలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.   ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’ వంటి హామీల అమలులో ప్రభుత్వం కోతలు పెడుతోందని విమర్శించిన కాకాణి, “అబద్ధానికి చొక్కా, ప్యాంటు వేస్తే…