News

National

వక్ఫ్ బిల్లును నిరసిస్తూ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టులో పిటిషన్..

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ హింస కారణంగా ముర్షిదాబాద్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.   బెంగాల్‌లో హింస, మరణాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా కోరారు. కోర్టు పర్యవేక్షణలో ఈ విచారణ కొనసాగాలని ఆయన విజ్ఞప్తి…

TELANGANA

గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో పెద్ద కుంభకోణం జరిగింది: పాడి కౌశిక్ రెడ్డి..

గ్రూప్-1 పరీక్షకు సంబంధించి కోఠి కళాశాలలోని 18, 19వ సెంటర్లలో 1,490 మంది పరీక్షకు హాజరుకాగా, 74 మంది ఎంపికయ్యారని… అదేవిధంగా 25 సెంటర్లలో 10 వేల మంది పరీక్ష రాస్తే కేవలం 69 మంది మాత్రమే ఎంపికయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. 654 మందికి ఒకే విధమైన మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.  …

TELANGANA

కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్..

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ భూములపై ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.   కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని భూములు ప్రభుత్వ భూములేనని అందులో పేర్కొంది. ఈ భూముల్లోనే కేంద్రీయ విశ్వవిద్యాలయం, మరికొన్ని సంస్థలు, బస్టాండ్ వంటివి వచ్చాయని తెలిపింది. సుమారు 20 ఏళ్లకు పైగా ఈ 400 ఎకరాల స్థలం…

AP

జైలులో గోరంట్లకు రాజభోగాలు..!

నిత్యం వార్తల్లో ఉండాలనుకునే వారిలో మాజీ పోలీసు అధికారి, వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకరు. ఆయన అధికారి ఉన్నప్పుడు ఎలాగ ఉండేవారో తెలీదు. ఎంపీగా ఉన్నప్పుడు మాత్రం ఆయన లీలలు అన్నీ ఇన్నీకావు. పదవి లేకపోయినా ఏ మాత్రం తగ్గేది లేదంటున్నారు. చేబ్రోలు కిరణ్‌పై దాడి కేసులో అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన ఉంటున్నారు. అక్కడ కూడా అధికారులకు చుక్కలు చూపిస్తున్నారని తెలుస్తోంది.   వైసీపీలో ఫైర్ బ్రాండ్‌ అవతారమెత్తారు…

AP

నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం..! రాజధాని అమరావతిలో అదనపు భూసేకరణపై చర్చ..!

నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. దీనికి- ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత వహించనున్నారు. సచివాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. రాజధాని అమరావతిలో అదనపు భూసేకరణ సహా పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు రానున్నట్లు సమాచారం.   త్వరలో అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉన్నందున.. వీటికి సంబంధించిన అంశాలు కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నాయి. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదిస్తుందని తెలుస్తోంది. గతంలో సీఆర్డీఏ భేటీలో తీసుకున్న నిర్ణయాలపై…

TELANGANA

మంత్రి పదవి పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి దక్కడం పక్కా అని, ఆ మేరకు పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే, కొందరు కావాలనే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి జానారెడ్డి పేరును ప్రస్తావించారు.   ధర్మరాజులా వ్యవహరించాల్సిన జానారెడ్డి వంటి సీనియర్ నేతలు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.…

TELANGANA

అమల్లోకి భూ భారతి చట్టం..!

ధరణిని రీప్లేస్‌ చేయబోతుంది భూభారతి. అంబేద్కర్ జయంతి రోజున అధికారికంగా సేవలను అందించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్ట్‌గా మూడు మండలాల్లో అమలు చేయనుంది ప్రభుత్వం. ఇంతకీ ఈ పోర్టల్‌లో ఉండే సేవలేంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి?   ఆర్వోఆర్‌-2020 స్థానంలో ఆర్వోఆర్‌-2025 భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమల్లోకి తీసుకురానున్నారు. దీంతోపాటు ధరణి స్థానంలో.. భూ భారతి పోర్టల్‌ సైతం అందుబాటులోకి రానుంది. మొదట మూడు మండలాల్లో పైలట్…

AP

365 రోజుల్లో వందపడకల ఆసుపత్రి..! మంత్రి నారా లోకేష్ ప్రకటన..!

మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలపడమే తన ధ్యేయమని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, రెండో కేబినెట్ సమావేశంలోనే మంగళగిరికి వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి, శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రానున్న 365 రోజుల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.   ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి నియోజకవర్గం…

AP

రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు..!

రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మెరుగైన సమాజం కోసం పాటుపడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, పదవులపై ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు. అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను మాత్రం కచ్చితంగా ప్రజల ముందు ఉంచుతానని ఆయన పేర్కొన్నారు.   కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం ఠాణేలంక…

National

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పోరు..! కీలక లోహాల ఎగుమతి నిలిపివేత..!

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో, కీలకమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సంబంధిత లోహాలు, అయస్కాంతాల ఎగుమతిపై చైనా కఠిన ఆంక్షలు విధించింది. ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్లు సహా అనేక కీలక రంగాలకు అత్యవసరమైన ఈ ముడిసరుకుల సరఫరాను నియంత్రించడం ద్వారా పాశ్చాత్య దేశాలను, ముఖ్యంగా అమెరికాను ఇరుకున పెట్టేందుకు బీజింగ్ ప్రయత్నిస్తోంది.   ఎగుమతుల కోసం చైనా ప్రభుత్వం సరికొత్త నియంత్రణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.…