News

National

దేశంలోనే మొదటిసారిగా… రైల్లో ఏటీఎం సేవ‌లు..!

ముంబ‌యి నుంచి మ‌న్మాడ్ వెళ్లే పంచవటి ఎక్స్‌ప్రెస్ రైలులో బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర త‌న ఏటీఎంను అమ‌ర్చింది. భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో ఇలా రైలులో ఏటీఎం ఏర్పాటు చేయ‌డం ఇదే తొలిసారి. ఏసీ చైర్ కార్ కోచ్ చివ‌ర‌లో సాధార‌ణంగా ఉండే ప్యాంట్రీ (చిన్న గ‌ది)లో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. దీనికి ప్ర‌త్యేకమైన ష‌ట‌ర్‌ను అమ‌ర్చారు. ఇప్ప‌టికే దాని ట్రయల్ రన్ విజయవంతమైందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో భారతదేశంలో తొలిసారిగా ఏటీఎం సేవ‌లు క‌లిగిన…

TELANGANA

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై కవిత సంచలన వ్యాఖ్యలు..! అందుకోసమే పార్టీ మారాడు అంటూ ఆరోపణ..?

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆశ్చర్యం కలిగించిందని, ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన డబ్బు కోసమే అధికార పార్టీ వైపు వెళ్లారని అందరూ అంటున్నారని ఆమె పేర్కొన్నారు.   ప్రజలకు ఏదైనా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఆయన పార్టీ మారాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. ఇటీవల ఎమ్మెల్యేల పనితీరుపై ర్యాంకులు ఇచ్చారని, 119 మంది…

TELANGANA

కంచ గచ్చిబౌలి భూముల్లోని చెట్ల నరికివేతపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు..

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఆ భూముల్లో చెట్ల నరికివేతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు తీసుకోకుండా చెట్లను కొట్టివేసినట్లు తేలితే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సహా సంబంధిత అధికారులు అందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.చెట్లు కొట్టేసే ముందు 1996లో…

AP

అమరావతికి రూ. 47,000 కోట్లు అవసరం: సీఎం చంద్ర‌బాబు..

రాజధాని అమరావతికి ఇంకా రూ. 47వేల కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డించారు. రాజ‌ధానిలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూ. 77,249 కోట్లు అవసరం కాగా… వరల్డ్ బ్యాంక్, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఫండింగ్ రూ. 31,000 కోట్లు సమకూరాయ‌ని తెలిపారు. ఇంకా కావాల్సిన నిధులు రూ.47,000 కోట్లు అని వివ‌రించారు.ఆంధ్రప్రదేశ్ అవసరాలు ఇవే..1. పోలవరం-బనకచర్ల అనుసంధానం2. తాగునీటి ప్రాజెక్టులు3. ఐదు పర్యాటక హబ్‌లు(అమరావతి, విశాఖపట్నం, అరకు,…

AP

జగన్ కు టీడీపీ సవాల్… గోశాలలో కలుద్దామన్న భూమన..

తిరుమలలోని ఎస్వీ గోశాల అంశం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. గోశాలలో వందకు పైగా ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ రంగు పులుముకున్నాయి. భూమన వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న భూమనపై కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, తాజాగా భూమనపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

National

వక్ఫ్ చట్టంపై పాక్ వ్యాఖ్యలు… భారత్ కౌంటర్..

వక్ఫ్ సవరణ చట్టంపై పాకిస్థాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఒక వర్గం వారి ఆస్తులకు దూరం చేయడానికే భారత్ ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని పాకిస్థాన్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్ కత్ అలీ పేర్కొన్నారు. ఇది మైనారిటీలను కించపరచడమేనని ఆయన అన్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. దీనిపై తాజాగా భారత్ ధీటుగా స్పందించింది.భారత పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుపై పాకిస్థాన్ చేసిన ప్రేరేపిత, నిరాధార వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని భారత విదేశాంగ…

TELANGANA

ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్..! సీఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయాలు..

పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటితే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పదవులపై బహిరంగ మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని.. ష్టమే జరుగుతుందని చెప్పారు. మంగళవారం జరిగిన సీఎల్పీ మీటింగ్‌లో సీఎం మాట్లాడారు. ఎవరైనా పదవులపై బయట మాట్లాడితే మంచికంటే చెడే ఎక్కువ జరుగుతుందన్నారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. ఇప్పటికే అనేకసార్లు చెప్పినని.. లీడర్లు అర్ధం కాకపోతే ఎలా అంటూ ఫైరయ్యారు.   ఎమ్మెల్యేలకు CM రేవంత్ సీరియస్ వార్నింగ్  …

AP

ఏపీ లిక్కర్ స్కాం… చిత్రపురి కాలనీలోని మేఘనా రెడ్డి నివాసంలో సోదాలు..

హైదరాబాద్‌లో ఏపీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారుల సోదాలు రెండో రోజు కూడా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు… హైదరాబాద్‌లోని మద్యం వ్యాపారుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ రోజు రాయదుర్గం పరిధిలోని చిత్రపురి కాలనీలో ఉన్న మేఘనా రెడ్డి నివాసంలో మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించారు. ఆమె బ్యాంకు ఖాతా నుంచి కొంత డబ్బును ఉపసంహరించుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో…

TELANGANA

తెలంగాణలో అధునాతన ఫైర్ ఫైటింగ్ రోబోలు..! దేశంలోనే మొట్టమొదటిసారి..!

రాష్ట్ర అగ్నిమాపక శాఖ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా, అత్యంత ప్రమాదకరమైన అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం అధునాతన ఫైర్ ఫైటింగ్ రోబోలను అందుబాటులోకి తెచ్చింది. సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లే క్లిష్ట పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ రోబో యంత్రాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ప్రారంభ దశలో భాగంగా, ఫ్రాన్స్ నుంచి మూడు అత్యాధునిక రోబోలను అగ్నిమాపక శాఖ సమకూర్చుకుంది. ఒక్కో రోబో విలువ సుమారు రూ. 2 కోట్లు కాగా, మొత్తం…

AP

పవన్ ‘కన్వర్టెడ్ సనాతని’.. పేర్ని నాని సంచలన వాఖ్యలు..!

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్‌ ఒక ‘కన్వర్టెడ్ సనాతని’ అని ఆయన అభివర్ణించారు. ఎన్నికలకు ముందు తన వైఖరికి, ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రదర్శిస్తున్న వైఖరికి మధ్య స్పష్టమైన తేడా ఉందని పేర్ని నాని ఆరోపించారు.   పేర్ని నాని మాట్లాడుతూ, “ఎన్నికల ముందు వరకు తనకు అన్ని మతాలు, కులాలు…