News

AP

సిట్ విచారణ అనంతరం విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్… కీలక విషయాలు వెల్లడి..!

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి సిట్ విచారణ ముగిసింది. దాదాపు 3 గంటల పాటు ఆయనను సిట్ అధికారులు విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనను సిట్ అధికారులు నాలుగు విషయాల గురించి అడిగారని తెలిపారు. తాను ఇచ్చిన సమాధానాలతో వారు తృప్తి చెందారనే అనుకుంటున్నానని చెప్పారు.   గతంలో జరిగిన రెండు సమావేశాల గురించి అడిగారని… ఆ రెండు సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఏం…

AP

‘స్వచ్ఛ ఆంధ్ర’ ఏప్రిల్ నెల థీమ్ ను వెల్లడించిన సీఎం చంద్రబాబు..

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ప్రతి నెల 3వ శనివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందుకోసం వివిధ థీమ్ లను అనుసరిస్తున్నారు. ఏప్రిల్ నెల థీమ్ ను తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.   “స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం ప్రతి నెలా 3వ శనివారం నాడు జరుపుకుంటున్నాం. ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు నెల నెలా…

National

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం ‘ధ్వని’..

భారత అమ్ముల పొదిలోకి కొత్తగా మరో శక్తిమంతమైన అస్త్రం వచ్చి చేరింది. దాని పేరు ‘ధ్వని’. హైపర్‌సానిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్‌జీవీ) అయిన ఈ క్షిపణి ఇప్పటికే ఉన్న అగ్ని-5ను మించి ఉంటుందని సమాచారం. అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి రేంజ్ 5,500 కిలోమీటర్లు కాగా, ‘ధ్వని’ రేంజ్ 6 నుంచి 10 వేల కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.   ఈ క్షిపణిని మన లాంచ్ సైట్ల నుంచి ప్రయోగించి ఆసియా, యూరప్‌తోపాటు ఉత్తర అమెరికాలోని…

TELANGANA

సైబరాబాద్‌పై ఉగ్రదాడికి కుట్ర.. ఎన్ఏఐ నివేదికలో కీలక విషయాలు..

హైదరాబాద్‌లో ఉగ్రదాడికి లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కుట్ర పన్నిందని, ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీ వెల్లడించినట్లు ఎన్ఐఏ నివేదిక పేర్కొంది. ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తహవ్వుర్ హుస్సేన్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. ఎన్ఐఏ గతంలోనే హెడ్లీని విచారించింది. ఈ విచారణలో హెడ్లీ సంచలన విషయాలు వెల్లడించినట్లు ఎన్ఐఏ నివేదిక ద్వారా తెలుస్తోంది.   తాను ఎల్ఈటీతో కలిసి పనిచేసినట్లు డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. ఉగ్రదాడుల ప్రణాళికలో భాగంగా పలుమార్లు…

TELANGANA

బీఆర్ఎస్ రజతోత్సవ సభ… నేతలకు కీలక సూచనలు చేసిన కేసీఆర్..

ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాకు చెందిన పలువురు నేతలు, మహిళా నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు.   రజతోత్సవ సభలో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు, సభను విజయవంతం చేయడంలో వారి భాగస్వామ్యం, కార్యాచరణ, అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి…

TELANGANA

సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనలో బిగ్ డీల్..!

సీఎం రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనలో బిగ్ డీల్. తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడితో సరికొత్త ప్రాజెక్ట్ చేపట్టేందుకు ‘మారుబేని’ కంపెనీ ముందుకొచ్చింది. రేవంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యూచర్ సిటీలో.. 600 ఎకరాల్లో.. వరల్డ్ క్లాస్ నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబెనీ సంస్థ అంగీకరించింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ బృందాన్ని కలుసుకుని.. పెట్టుబడులపై చర్చించారు. ముఖ్యమంత్రి సమక్షంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేశారు. ఈ ప్రాజెక్ట్ సాకారమైతే.. ఫ్యూచర్…

AP

భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డిపై కేసు న‌మోదు..

టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైసీపీ నేత‌ భూమన కరుణాకర్‌రెడ్డిపై తిరుప‌తి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఎస్పీ హ‌ర్ష వ‌ర్ధ‌న్ రాజుకు ఫిర్యాదు చేశారు.   ఎస్వీ గోశాల‌లో 100 ఆవులు మృతిచెందాయ‌ని… ప‌విత్ర‌మైన గోశాల‌ను గోవ‌ధ శాల‌గా మార్చారంటూ భూమ‌న త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఆయ‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ బోర్డు స‌భ్యుడు భానుప్ర‌కాశ్‌రెడ్డి మంగ‌ళ‌వారం నాడు…

AP

జగన్‌ అక్రమాస్తుల కేసులో రూ. 793 కోట్ల విలువైన దాల్మియా సిమెంట్‌ ఆస్తులు తాత్కాలిక జప్తు..

జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా భారత్ సిమెంట్స్‌ లిమిటెడ్ (డీబీసీఎల్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన రూ.793.34 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి చెందిన భారతి సిమెంట్స్‌లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడిపై 2011లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగా డీబీసీఎల్ ఆస్తుల జప్తుకు ఆదేశాలు ఇచ్చామని ఈడీ తెలిపింది. డీబీసీఎల్ గతంలో హైదరాబాద్‌లో రూ. 377.26 కోట్లతో కొనుగోలు చేసిన భూమిని…

TELANGANA

గ్రూప్-1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-1 నియామక ప్రక్రియపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 నియామక ప్రక్రియపై విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఇవ్వవద్దని ఆదేశించింది. అయితే వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను మాత్రం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.   గ్రూప్-1 ఫలితాలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. రెండు సెంటర్లలోనే 74 మందికి ర్యాంకులు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయనడానికి ఇదే నిదర్శనమని…

National

వక్ఫ్ చట్టం-2025ను సవాల్ చేస్తూ 72 పిటిషన్లు… సుప్రీంకోర్టులో విచారణ..

వక్ఫ్ సవరణ చట్టం-2025 రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వక్ఫ్ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 72 పిటిషన్లు దాఖలయ్యాయి. వక్ఫ్ బిల్లుపై సమాధానం చెప్పేందుకు కేంద్రం వారం రోజుల గడువు కోరడంతో న్యాయస్థానం అంగీకరించింది.తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అప్పటివరకు వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 5వ తేదీకి వాయిదా…