News

CINEMA

ప్రభాస్ ‘కల్కి’ మూవీ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఖరారు..!

ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సైన్స్ ఫిక్సన్, పురాణాల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై ఫుల్ హైప్ ఉంది. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.   అయితే ఇప్పుడు మరో వార్త బయటకొచ్చి సినీ ప్రియుల్ని, అభిమానుల్ని నిరాశపరిచింది. అదేంటనే విషయానికొస్తే..…

TELANGANA

10వేల మందితో మేడిగడ్డ ముట్టడికి ముహూర్తం ఫిక్స్.. రైతులకు కేసీఆర్ పిలుపు..!

తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో నీటి ఎద్దడి చోటు చేసుకోగా పంటలు ఎండిపోతున్న పరిస్థితులపై బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ దృష్టిసారించి నేడు పొలం బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడుకరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.   రైతులతో మాట్లాడిన కేసీఆర్ పలువురు రైతులు కేసిఆర్ ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. గత…

TELANGANA

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరో షాక్.. సీబీఐ విచారణకు రంగం సిద్ధం..

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను విచారించేదుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ రూస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది. తాజాగా కోర్టు కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ వచ్చే వారం కవితను విచారించనుంది. కాగా విచారణకు ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని కోర్టు సీబీఐను ఆదేశించింది. మహిళా కానిస్టేబుల్ సమక్షంలో కవితను ప్రశ్నించాలని కోర్టు…

AP

ఎప్రిల్ 7 నుంచి ఉత్తరాంధ్రలో వారాహి విజయభేరి యాత్ర..

ఏప్రిల్ 7 నుంచి పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి యాత్ర ఉత్తరాంధ్రలో నిర్వహించనున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా పవన్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. పిఠాపురంలో వారాహి విజయభేరి ప్రచార యాత్ర తర్వాత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కోలుకోవడంతో మళ్లీ ప్రచారంలోకి దిగనున్నారు. ఏప్రిల్ 7 నుంచి ఉత్తరాంధ్రలో వారాహి యాత్ర నిర్వహించనున్నారు.   యాత్రలో భాగంగా అనకాపల్లిలో 7న సభ నిర్వహించనున్నారు. 8న ఎలమంచిలి, 9న పిఠాపురంలో సభ…

AP

టీడీపీలో చేరిన రఘురామకృష్ణ రాజు.. పోటీ ఎక్కన్నుంచో మరి..?

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు తెలుగు దేశం పార్టీలో చేరారు. పాలకొల్లు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. టీడీపీ కండువా కప్పి చంద్రబాబు ఆయన్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.   ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. చంద్రబాబు చొరవతోనే ప్రజలముందుకొచ్చాని తెలిపారు. టీడీపీ అధినేత, ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. జూన్ 4న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాలలో ప్రభంజనం సృష్టించబోతున్నారని పాలకొల్లు సభలో అన్నారు.  …

National

డ్రైవర్ లేకుండా మెట్రో రైలు పరుగులు.. ఎక్కడో తెలుసా..?

లోకోపైలట్ లేకుండా నడిచే మెట్రో రైళ్లు దేశంలో తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సర్వీస్ మొట్టమొదటి సారిగా చెన్నైలో రానుంది. ఈ మేరకు ఆగస్టు నెలలో మొదటి డ్రైవర్ లెస్ మెట్రో రైలు పట్టాలపై పరుగులు పెట్టనుంది.   ఈ సందర్భంగా చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ అధికారులు మాట్లాడుతూ.. రాబోయే నెలలో అదనపు డ్రైవర్ లెస్ సెట్లు వస్తాయని వెల్లడించారు. 26 కిలో మీటర్ల మేరా 28 మెట్రో స్టేషన్లను ఈ ప్రాజెక్టులో భాగం చేయనున్నారు.…

TELANGANA

మధ్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వ్.. అప్పటిదాకా టెన్షన్..!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 8వ తేదీ సోమవారం రోజున ఉదయం 10:30 కు తీర్పును వెల్లడిస్తామని పేర్కొంది.   కవిత అభ్యర్ధన మానవతా కోణంలోకి రాదు తన చిన్న కుమారుడు పరీక్షల కారణంగా ఏప్రిల్ 16వరకు బెయిల్ ఇవ్వాలని…

AP

రఘురామ సీట్ ఫిక్స్, టిడిపి అభ్యర్థుల్లో మార్పులు – ఎవరెక్కెడ..!

ఏపీ ఎన్నికల రాజకీయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు పార్టీల ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే సీట్లు అభ్యర్థుల కసరత్తు పూర్తయింది. కానీ తాజాగా టిడిపిలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో మరోసారి అభ్యర్థుల మార్పు ఖాయంగా కనిపిస్తుంది. రఘురామరాజు టిడిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.   సీట్ల సర్దుబాటు మూడు పార్టీల ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటు ఏపీలో పూర్తయింది ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనే దాని పైన నిర్ణయం తీసుకున్నారు. మూడు పార్టీల నుంచి…

AP

చంద్రబాబుకు ఎన్నికల సంఘం నోటీసులు.. ఎందుకంటే..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచార ప్రసంగంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఫిర్యాదు చేసింది.   సీఈవో ముకేష్ కుమార్ మీనాకు వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో…

National

కేజ్రీవాల్ ఫోన్ అనలాక్‌కు నో చెప్పిన ఆపిల్.. తలపట్టుకున్న ఈడీ….

తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఫోన్‌ను యూజర్ గోప్యత దృష్ట్యా అన్‌లాక్ చేయడానికి ఆపిల్ కంపెనీ నిరాకరించింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తులో సహకరించడానికి ఆపిల్ నిరాకరించినట్లు తెలుస్తోంది.   సెట్ పాస్‌వర్డ్‌ని ఉపయోగించి డివైజ్ యజమాని మాత్రమే డేటాను యాక్సెస్ చేయగలరని ఆపిల్ తేల్చిచెప్పినట్లు సమాచారం.   నివేదికల ప్రకారం, కేజ్రీవాల్ ఫోన్‌ను తెరవడానికి ఈడీ అనేకసార్లు ప్రయత్నించి విఫలమైంది. ఇక తప్పేది లేక ఆపిల్…