News

TELANGANA

ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ఉండదా..?

లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి వలసల బెడదను ఎదుర్కొంటోంది. సీనియర్లు సైతం కేసీఆర్‌, ఆయన పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో చేరుతున్నారు.   ఈ పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయాత్తం అయ్యారు కేసీఆర్. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. నీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించడానికి ఉద్దేశించిన పర్యటనలు ఇవి. కరవుతో…

TELANGANA

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా: ఎందుకంటే..?

ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ఈ ప్రక్రియను జూన్ 2వ తేదీకి వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాగా, గత గురువారం ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.   ఉమ్మడి జిల్లా పరిధిలో 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ,…

AP

ఫొటోలంటూ వచ్చి బ్లేడ్లతో కోసేస్తున్నారు-పవన్ సంచలన ఆరోపణలు..!

ఏపీలో రాజకీయం అంతా ఓ ఎత్తు పిఠాపురం రాజకీయం ఓ ఎత్తు అన్నట్లుగా మార్చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. పిఠాపురంలో మూడు రోజులుగా పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్.. అక్కడ తనకు ఎదురైన అనుభవాలపై ఇవాళ చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.   ముఖ్యంగా అభిమానుల ముసుగులో వచ్చిన కొందరు తనతో ఎలా ప్రవర్తిస్తున్నారన్న దానిపై పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.   ఇవాళ పిఠాపురంలో టీడీపీతో పాటు పలు పార్టీల నేతలు…

AP

జగన్ Vs చంద్రబాబు, 66 లక్షల ఓట్ బ్యాంక్ – వణుకు మొదలు, సెల్ఫ్ గోల్..!

ఏపీలో ఇప్పుడు వాలంటీర్ల పై ఈసీ ఆంక్షల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్నికల వేళ పెన్షర్ల ఓట్ బ్యాంక్ ఎవరికి ఎన్నికల ప్రచార అస్త్రంగా మారుతోంది. చంద్రబాబు అండ్ కో ఫిర్యాదు కారణంగానే ఎన్నికల సంఘం వాలంటీర్ల పైన ఆంక్షలు విధించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఆలస్యం కాకుండా పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు సీఎస్ ను కోరారు. 66 లక్షల లబ్దిదారులు ఉండటంతో ఎవరిని ముంచుతుందో అనే టెన్షన్ మొదలైంది.   పెన్షన్లు…

National

కాశ్మీర్‌లో విరిగిపడిన కొండచరియలు.. జమ్మూ-శ్రీనగర్ రోడ్ బ్లాక్…

జమ్మూ-కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆదివారం జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.   270 కిలోమీటర్ల పొడవైన హైవేపై ట్రాఫిక్‌ను త్వరగా పునరుద్ధరించేందుకు కిష్త్వారీ పథేర్, మెహర్-కెఫెటేరియా మోర్ వద్ద రోడ్డు క్లియరెన్స్ పనులు ఉదయం నుంచి కొనసాగుతున్నాయని, కాశ్మీర్‌ను దేశంలో మిగిలిన ప్రాంతాలతో కలిపే ఏకైక ఆల్-వెదర్ రోడ్ అని ట్రాఫిక్ విభాగం అధికారి ఒకరు తెలిపారు.   అర్ధరాత్రి సమయంలో బనిహాల్ ప్రాంతంలోని…

National

మరో నోటీసు.. రూ. 1,745 కోట్లు కట్టాలని కాంగ్రెస్‌కు ఐటీ సమన్లు..

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ ప్రభుత్వం కష్టాల ఊబిలోకి నెట్టేలా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. 1,745 కోట్లు కట్టాలని సూచిస్తూ మరోసారి సమన్లు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే(రెండ్రోజుల క్రితం) రూ. 1,823 కోట్లు చెల్లించాలని కోరుతూ నోటీసులు జారీ…

AP

నా ఫోన్ ట్యాప్ చేసి బెదిరించి.. కోట్లు ఎత్తుకెళ్లారు: సంధ్య కన్వేన్షన్స్ ఎండీ..

తెలంగాణలో సంచలం రేపుతున్న ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులు తనఫోన్ ట్యాప్ చేశారంటూ.. సంధ్య కన్వేన్షన్స్ ఎండీ శ్రీధర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్య శ్రీధర్ రావును దర్యాప్తు బృందం విచారణకు రావాలని బంజారాహిల్స్‌ పీఎస్‌కు పిలిచింది.   విచారణ అధికారుల పిలుపు మేరకు.. సంధ్య శ్రీధర్‌రావు తన అడ్వకేట్స్‌తో కలిసి బంజారాహిల్స్‌ పీఎస్‌కు వెళ్లారు. ప్రస్తుతం శ్రీధర్‌రావు స్టేట్మెంట్‌ను అధికారులు రికార్డు చేస్తున్నారు. తన…

TELANGANA

ఎండిపోయిన ప్రతి ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం.. కేసీఆర్ డిమాండ్..

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు చేసే సమయం ఉందికానీ.. రైతులకు రైతు బంధు వేసే తీరక లేదని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం సెట్ కావడానికి కాస్త సమయం ఇచ్చామని.. ప్రస్తుతం 4 నెలల సమయం అయినందునే ప్రశ్నిస్తున్నామని అన్నారు.   రాష్ట్రంలో నెలకొన్న నీటి, విద్యుత్ సమస్యకు కారకులెవరని ప్రశ్నించారు. దేశంలో ఉన్న నెంబర్ 01గా ఉన్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇంత…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికా నుంచి వస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ..!

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఈ కేసులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఆయన కేంద్రంగా ఈ వ్యవహారం సాగిందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సోమవారం ఆయన హైదరాబాద్ వస్తున్నారని తెలుస్తోంది.   ప్రభాకర్ రావును ప్రశ్నిస్తే కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఆయన వెల్లడించే సమాచారం ఆధారంగా బీఆర్ఎస్ నాయకులు నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. ప్రభాకర్…

TELANGANA

తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు వీరే….

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీ-కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేస్తామని రాష్ట్ర అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లును ఏఐసీసీ నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దీపా దాస్ మున్షీ ప్రకటించారు. ఈ జాబితాను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.   తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లు…