ఎంపీ అభ్యర్థులుగా కేసీఆర్ అనూహ్య ఎంపిక – మరో ఇద్దరి ప్రకటన..!!
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి రాజుకుంది. మూడు ప్రధాన పార్టీలకు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. బిజెపి, కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటించాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరో రెండు నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ఖరారు చేశారు. అభ్యర్థుల ఖరారు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లోను పట్టు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాలను రెండు విడతలుగా ఖరారు చేసింది. బిజెపి తమ అభ్యర్థులను ప్రకటించింది.…

