News

TELANGANA

ఎన్నికల వేళ.. బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చేరికలకు గేట్లెత్తేశారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితిని ఖాళీ చేసే పనిలో పడ్డారు. బీఆర్ఎస్‌లో ఉన్న మాజీ కాంగ్రెస్ నాయకులను మళ్లీ సొంత గూటికి రప్పించుకుంటోన్నారు.   ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు.. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జిల్లా పరిషత్…

TELANGANA

కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..

కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు.   అన్ని పార్టీల నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటామని మంత్రి పొన్నం తెలిపారు. అయితే, నాటి సమగ్ర సర్వే వివరాలు ఎందుకు…

TELANGANA

పవన్ పోటీ నియోజకవర్గాలపై చంద్రబాబు కీలక సూచన..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. వైసీపీ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ తుది దశక చేరింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పైన ఒక అంచనాకు వచ్చారు. బీజేపీతో పొత్తు అంశం తెర మీదకు రావటంతో సీట్ల ప్రకటన వాయిదా పడింది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల పైన ఆసక్తి కొనసాగుతోంది. తాజాగా చంద్రబాబుతో చర్చల్లో పవన్ పోటీ చేసే నియోజకవర్గాల పైన క్లారిటీ వచ్చినట్లు సమాచారం.   కొత్త…

AP

వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన సీమ సభ..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపత్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతున్నారు.   ఇప్పటికే రెండు విడతల్లో సిద్ధం బహిరంగ సభలు ముగిశాయి. విశాఖపట్నం జిల్లా భీమిలీలో నిర్వహించిన సభ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు.…

National

స్వలింగ వివాహాలకు గ్రీన్‌సిగ్నల్..

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే దిశగా గ్రీస్‌లో అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన బిల్లుకు తాజాగా గ్రీస్ పార్లమెంట్‌లో ఆమోదం లభించింది. తద్వారా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన తొలి ఆర్థోడాక్స్ క్రైస్తవ దేశంగా గ్రీస్ నిలిచింది. దీంతో గ్రీస్ ప్రభుత్వానికి LGBT సమాజం ధన్యవాదాలు తెలిపింది. స్వలింగ వివాహాలకు ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాలు మద్దతు ఇస్తున్నాయి.

National

‘యువ విజ్ఞాని’కి ఇస్రో దరఖాస్తుల ఆహ్వానం..

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ పాఠశాల విద్యార్థుల కోసం యువ విజ్ఞాని కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నెల 20 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ‘ఎక్స్‌’లో తెలిపింది. ‘క్యాచ్‌ దెమ్‌ యంగ్‌’ పేరిట రెండు వారాల పాటు అంతరిక్ష సాంకేతికత, విజ్ఞానం, అప్లికేషన్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. 2024 జనవరి 1కి 9వ తరగతి చదువుతున్న విద్యార్ధులు అర్హులుని తెలిపారు.

TELANGANA

నేడు కాంగ్రెస్‌లో చేరనున్న బీఆర్ఎస్‌ కీలక నేతలు..?

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలనుంది. ఆ పార్టీ ముఖ్య నేతల కుటుంబాలు బీఆర్ఎస్‌ను వీడనున్నాయి. వారిలో పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితా రెడ్డి, ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు ఉన్నట్లు తెలుస్తోంది. నేడు గాంధీ భవన్‌లో వీరికి దీపా దాస్ మున్షి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

TELANGANA

కొమురవెల్లిలో రైల్వే స్టేషన్.. నెరవేరుతున్న ఛిరకాల వాంఛ..

ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న భక్తులకు ఛిరకాల వాంఛ తీరబోతోంది. కొత్తపల్లి-మనోహరాబాద్ నూతన రైలు మార్గంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌తో కలిసి భూమి పూజ చేశారు. అంతకుముందు వీరు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంత్ రెడ్డి ఉన్నారు.  …

TELANGANA

హరీశ్ రావు సీఎం కావాలంటే ఏం చేయాలో చెప్పిన రేవంత్ రెడ్డి..

గత ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడంపైనే దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. నూతనంగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను సీఎం రేవంత్ అందించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.   కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నియామకాలపై దృష్టి సారించామని సీఎం రేవంత్ తెలిపారు. గత రభుత్వ పదేళ్ల అన్యాయాలను గుర్తించిన ప్రజలు.. వారిని గద్దె దింపారని సీఎం స్పష్టం చేశారు.…

TELANGANA

తెలంగాణలో మరో 26 మంది డీఎస్పీల బదిలీ..

తెలంగాణ రాష్ట్రంలో డీఎస్పీల బదిలీలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పని చేస్తోన్న 95 మంది డీఎస్పీలను బుధవారం బదిలీ చేయగా.. తాజాగా గురువారం మరో 26 మంది డీఎస్పీలను బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.   బుధవారం హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో కొనసాగుతున్న డీఎస్పీలను, ఏసీపీలను బదిలీ చేశారు. రానున్న…