News

TELANGANA

అసెంబ్లీలో ప్రాజెక్టులపై సమరం..

తెలంగాణ అసెంబ్లీ వేదికగా డైలాగ్ వార్ కొనసాగింది. కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్‌ఎంబీకి అప్పగించే ప్రసక్తేలేదంటూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. దీని పైన చర్చ సమయంలో సీఎం రేవంత్, మంత్రులు వర్సస్ హరీష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీ సీఎం జగన్ ప్రస్తావన వచ్చింది. ఏపీకి ప్రయోజనం చేసేలా కేసీఆర్ వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం, మంత్రుల వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ కౌంటర్ చేసారు.   అసెంబ్లీలో డైలాగ్…

TELANGANA

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ బదిలీలు..

లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించింది. ఇంకో నెల రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.   తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.…

AP

చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై సుప్రీంలో కీలక పరిణామం..!!

ఏపీలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు పైన సీఐడీ నమోదు చేసిన కేసుల్లో వరుసగా ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తున్నారు. ఇదే సమయంలో స్కిల్ స్కాంలో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సీఐడీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీని పైన సుప్రీం ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. చంద్రబాబు న్యాయవాదుల అభ్యర్దన మేరకు ఈ కేసు విచారణ ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది.   స్కిల్…

AP

జగన్ ఆపరేషన్ అపోజీషన్ వయా ఢిల్లీ..

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ ఇప్పటికే ఎన్నికల సమరశంఖం పూరించారు. అభ్యర్దుల ఖరారు తుది దశకు చేరింది. టీడీపీ, జనసేన రెండు పార్టీలు జగన్ ఓటమి లక్ష్యంగా ఒక్కటయ్యాయి. బీజపీ ఈ రెండు పార్టీలతో కలిసి రావటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే జగన్ అలర్ట్ అయ్యారు. ఢిల్లీ కేంద్రంగా రాజకీయం మొదలు పెట్టారు. ప్రస్తుత పరిణామాలు అన్నీ జగన్ కోరుకున్న విధంగానే జరుగుతున్నాయి. మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది.  …

National

ఢిల్లీ వద్ద భారీ నిరసనకు అన్నదాతలు రెడీ..!

మూడేళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీని భారీ సంఖ్యలో చుట్టుముట్టిన రైతులు.. మరోసారి నిరసనకు రెడీ అయ్యారు. మరి కొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలుండగా.. ఇలాంటి నిరసనలు తమ ప్రభుత్వానికి అపఖ్యాతి తెచ్చిపెడతాయని మోదీ నాయకత్వంలోని బిజేపీ ప్రభుత్వం భయపడుతోంది. అందుకే రైతు సంఘాలను నిరసన చేయకుండా ఆపేందుకు, అణిచివేసేందుకు.. అన్ని ప్రయత్నాలు చేస్తోంది.   ఫిబ్రవరి 13న దేశంలోని 200కు రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల వద్ద మహాధర్నాకు సన్నధమవుతున్నారు. ఈ ధర్నాలో పంజాబ్,…

AP

నారా లోకేష్‌కు వినతుల వెల్లువ..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లు తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమన్నారు ఆ పార్టీ నేత నారా లోకేష్. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం యాత్ర’కు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ పాలనలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే.. జగన్ గంజాయి క్యాపిటల్‌గా మార్చారని లోకేష్ దుయ్యబట్టారు.   నాలుగున్నరేళ్లలో…

AP

ఏపీ ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు..

ఏపీ ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటం దాదాపు ఖాయమైంది. 2014 తరహా పొత్తులతోనే జగన్ ను ఓడించగలమని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. బీజేపీ నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. అయితే, సీట్ల ఖరారు పైనే తుది నిర్ణయం ఆధారపడి ఉంది. ఈ సమయంలో పవన్ కు బీజేపీ బిగ్ టాస్క్ అప్పగించింది. చంద్రబాబు పై ఒత్తిడి పెరుగుతోంది. పొత్తుల్లో కీలక మలుపు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.   ఎవరికెన్ని…

TELANGANA

17 నియోజకవర్గాల్లో బీజేపీ బస్సు యాత్రలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో తెలంగాణ బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అంతేగాక, విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1025 కిలోమీటర్ల మేర ఐదు బస్సు యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆదివారం యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..…

TELANGANA

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సరికొత్త ఆలోచన..

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సరికొత్త ఆలోచన అమల్లోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఒకే ఒక్కడు సినిమా తరహాలో నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేయించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామాన్ వద్ద ఫిర్యాదు బాక్స్‌ను వెంకట రమణారెడ్డి ఆదివారం ప్రారంభించారు.   కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ఈ బాక్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కేవీఆర్ తెలిపారు. ఫిర్యాదులను గ్రామానికి వచ్చి నేరుగా తానే పరిష్కరిస్తానని తెలిపారు.…

CINEMA

‘ఆర్‌సీ17’ సంబంధించి వైరలవుతున్న క్రేజ్ న్యూస్..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్‌ ‘ఆర్‌సీ17’కు సంబంధించి ఓ న్యూస్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనికి సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. దీని కోసమే చరణ్‌ రెండు, మూడుసార్లు ఈ మధ్య ముంబై వెళ్లి వచ్చారని టీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. సంజయ్‌ హిస్టారికల్స్‌ తీయడంలో దిట్ట. చరణ్‌తో చేయబోతున్న సినిమా కూడా హిస్టారికల్‌ మూవీనే అని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి